వారెవ్వా.. శునకంపై స్వారీ చేసిన చిన్నారి.. చుట్టూ గుంపుగా వీధి కుక్కల సెక్యూరిటీ..!

అయితే, అలాంటిదే ఇక్కడ వైరల్‌ అవుతున్న వీడియోలో ఒక చిన్నారి "Z+ సెక్యూరిటీ"కి కొత్త అర్థం ఇచ్చింది. ఆరోగ్యంగా, బలంగా కనిపిస్తున్న ఓ వీధి కుక్కపై చిన్నారి హాయిగా స్వారీ చేస్తూ కనిపించింది. అంతేకాదు.. ఆమె చుట్టూ ఆరు నుంచి ఏడు వరకూ ఇతర కుక్కలు కూడా ఉన్నాయి. అవన్నీ ఆమె వెంట నడుస్తుండటం వీడియోలో కనిపించింది.

వారెవ్వా.. శునకంపై స్వారీ చేసిన చిన్నారి.. చుట్టూ గుంపుగా వీధి కుక్కల సెక్యూరిటీ..!
Child Riding A Dog

Updated on: May 22, 2025 | 4:04 PM

సోషల్ మీడియాలో అనేక రకాలైన వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఈ వీడియోల్లో కొన్ని చాలా అందంగా ఉంటే, కొన్ని చాలా ఫన్నీగా ఉంటాయి. ఈ క్రమంలనే ఇంటర్‌నెట్‌లో ఓ అద్భుతమైన వీడియో వైరల్‌ అవుతోంది. ఈ వీడియోను చూసినవారంతా ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకుంటున్నారు. ఎందుకంటే.. వైరల్ అవుతున్న వీడియోలో, ఓ చిన్నారి శునకంపై స్వారీ చేస్తూ చుట్టూ భారీ బందోబస్తుతో రోడ్డుపై దర్జాగా తిరుగుతూ కనిపిస్తుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…

హై సెక్యూరిటీ, హెవీ గార్డ్స్, బ్లాక్ SUV వాహనాల్లో వీఐపీలు తిరుగుతుంటారు. ఇది మనం తరచూ చూస్తూనే ఉంటాము. అయితే, అలాంటిదే ఇక్కడ వైరల్‌ అవుతున్న వీడియోలో ఒక చిన్నారి “Z+ సెక్యూరిటీ”కి కొత్త అర్థం ఇచ్చింది. ఆరోగ్యంగా, బలంగా కనిపిస్తున్న ఓ వీధి కుక్కపై చిన్నారి హాయిగా స్వారీ చేస్తూ కనిపించింది. అంతేకాదు.. ఆమె చుట్టూ ఆరు నుంచి ఏడు వరకూ ఇతర కుక్కలు కూడా ఉన్నాయి. అవన్నీ ఆమె వెంట నడుస్తుండటం వీడియోలో కనిపించింది.

వీడియో ఇక్కడ చూడండి…

ఇవి కూడా చదవండి

వైరల్ వీడియోలో మొదట చూస్తే ఆ చిన్నారి కుక్కలతో కలిసి నడుస్తుందనిపించినా, ఆ తరువాత బాలిక కుక్కపై స్వారీ చేస్తూ ఆ వీధిలో రాజ కుమార్తెలా కనిపించడం చూసి నెటిజన్లు ఫదా అవుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..