Viral Video: ఈ కోడి పిల్ల స్పైడర్ మ్యాన్ సినిమా చూసినట్టుంది.. ఇలా కూడా పారిపోవచ్చా?

మీరు ఎప్పుడైనా కోడి పిల్ల గోడ ఎక్కడం చూసారా? చూడలేదా.. ఐతే ఇప్పుడు చూసెయ్యండి! కోడిపిల్ల గోడ ఎక్కుతున్న వీడియో ఒకటి సోషల్..

Viral Video: ఈ కోడి పిల్ల స్పైడర్ మ్యాన్ సినిమా చూసినట్టుంది.. ఇలా కూడా పారిపోవచ్చా?
Chick

Updated on: Feb 03, 2022 | 2:09 PM

A chick is climbing up the wall like Spider: మీరు ఎప్పుడైనా కోడి పిల్ల గోడ ఎక్కడం చూసారా? చూడలేదా.. ఐతే ఇప్పుడు చూసెయ్యండి! కోడిపిల్ల గోడ ఎక్కుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో పూనకం వచ్చినట్టు వైరల్ అవుతోంది. ఈ కోడిపిల్ల గోడ ఎక్కే తీరు చూస్తుంటే ఎవరైనా పనికట్టుకుని ట్రైనింగ్ ఇచ్చారేమోననే అనుమానం కలుగుతుంది కూడా. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఒక్క రోజులోనే ఈ వీడియో నెట్టింట హల్‌చల్ చేస్తోంది. ఆ విశేషాలు మీకోసం..

ఇంటి పెరట్లోని గోడ ఎక్కేందుకు ఓ కోడిపిల్ల ప్రయత్నించడం ఈ వీడియోలో కనిపిస్తుంది. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆశ్యర్యంతో తలమునకలైపోతున్నారు. కోడిపిల్ల స్పైడర్ మ్యాన్ లాగా గోడ పైకి ఎక్కడం కనీవినీ ఎరుగునా? ఎక్కడమే కాదు.. ఆ వైపుకు దూకేందుకు ప్రయత్నిస్తుంటే వీడియో తీస్తున్న వ్యక్తి వెంటనే పట్టుకుని కింద వదిలాడు. కాకపోతే సదరు వ్యక్తికి కూడా కోడిపిల్ల గోడ ఎక్కగలదని తెలిసినట్టులేదు. ‘ది గ్రేట్ డక్లింగ్ ఎస్కేప్ (The Great Duckling Escape)’ అనే క్యాప్షన్‌తో పోస్టు చేసిన ఈ ఫన్నీవీడియోకు లక్షల్లో వీక్షిస్తున్నారు. ‘తప్పించుకుని పారిపోవాలనుకున్న కోడిపిల్ల ప్రణాళిక గుట్టు రట్టయ్యిందని ఒకరు, స్పైడర్ డక్ అని మరొకరు, జేమ్స్ బాండ్ కోడిపిల్ల అని ఇంకొకరు .. ఇలా వేలల్లో కామెంట్లు పెడుతున్నారు. ఏదిఏమైనా గోడ దూకి పారిపోయే కోళ్లను చూశాం.. ఇలా గోడ ఎక్కి పోరాపోయే కోడిపిల్లను చూడటం మాత్రం అరుదే కదా!

Also Read:

GATE 2022: గేట్ 2022 వాయిదాపై దాఖలైన పిటీషన్‌ను కొట్టేసిన సుప్రీంకోర్టు.. విద్యార్థుల జీవితాలతో ఆటలాడలేం!