AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: వాట్ యాన్ ఐడియా మేడం జీ.. అసలు ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు.. వీడియో వైరల్‌..

బెంగళూరులో ఒక మహిళ బైక్ నడుపుతూ సెల్ ఫోన్ మాట్లాడుతోంది. ఇది ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధమైనా ఇలా ఫోన్ మాట్లాడేవారికి మనం చాలా రోడ్లపై చాలా మందికి చూస్తాం. కానీ ఈ మహిళ తన చున్నీని తలకు నిలువునా చుట్టుకుంది. దానిలో ఫోన్ ను ఉంచి మాట్లాడుతూ స్కూటర్ నడుపుతోంది. ఫోన్ పడిపోకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంది.

Viral Video: వాట్ యాన్ ఐడియా మేడం జీ.. అసలు ఎలా వస్తాయో ఇలాంటి ఐడియాలు.. వీడియో వైరల్‌..
Using Phone While Driving
Madhu
|

Updated on: Apr 01, 2024 | 12:38 PM

Share

నేటి కాలంలో సోషల్ మీడియాకు విపరీతమైన ప్రజాదరణ ఉంది. దానిలో వస్తున్న వింతలు, విశేషాలు, వార్తలు, మీమ్స్ విపరీతంగా వైరల్ అవుతున్నాయి. క్షణంలో వార్తలు ప్రపంచమంతా వ్యాపిస్తున్నాయి. వాటిలో కొన్ని సరదాగా, ఆకట్టకునేలా ఉంటున్నాయి. ఇటీవల స్కూటర్ నడుపుతూ ఫోన్ మాట్లాడుతున్న ఓ మహిళ వీడియో విపరీతంగా వైరల్ అయ్యింది. వేల మంది దీనికి వీక్షించారు. అనేక మంది వివిధ వ్యాఖ్యానాలు చేశారు.

బెంగళూరులో ఘటన..

బెంగళూరులో ఒక మహిళ బైక్ నడుపుతూ సెల్ ఫోన్ మాట్లాడుతోంది. ఇది ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధమైనా ఇలా ఫోన్ మాట్లాడేవారికి మనం చాలా రోడ్లపై చాలా మందికి చూస్తాం. కానీ ఈ మహిళ తన చున్నీని తలకు నిలువునా చుట్టుకుంది. దానిలో ఫోన్ ను ఉంచి మాట్లాడుతూ స్కూటర్ నడుపుతోంది. ఫోన్ పడిపోకుండా చాలా జాగ్రత్తలు తీసుకుంది. అలాగే చేతులతో ఫోన్ ను పట్టుకోకుండా మాట్లాడుతోంది. విద్యారణ్యపుర సమీపంలోని ఎన్ టీఐ మైదానం ఎదురుగా మార్చి 26న ఈ ఘటన జరిగింది.

వీడియో వైరల్

ఈ మహిళ వీడియో సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్ లో వైరల్‌గా అయ్యింది. మొదట ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు. అలాగే @3rd Eye Dude ద్వారా మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్‌లో రీపోస్ట్ చేశారు. ద్విచక్ర వాహనం నడుపుతున్న ఆ మహిళ చాలా తెలివిగా ఫోన్ మాట్లాడుతోందని, చూడటానికి కొత్తగా అనిపించిందని అందులో పేర్కొన్నారు. నగరంలో ప్రతిచోటా ట్రాఫిక్ పోలీసులు ఉన్నా ఆమె ధైర్యానికి ఆశ్చర్యపోయమన్నారు.

నెటిజన్ల కామెంట్లు..

ఏది ఏమైనా మహిళ వీడియో విపరీతమైన ఆదరణ పొందింది. వీడియోను మార్చి 27న పోస్టు చేశారు. అప్పటి నుంచి 22 వేల మందికి పైగా వీక్షించారు. రోజు రోజుకూ వారి సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. దాదాపు 200 లైక్‌లు, అనేక కామెంట్లు కూడా వచ్చాయి. అనేక మంది ఈ వీడియోపై తమ అభిప్రాయాలను ఎక్స్ లో వెల్లడించారు.

  • ఒక వ్యక్తి ఈ పోస్టుపై కామెంట్ రాశాడు. కొచ్చిలో తన  వ్యాపార భాగస్వామి కూడా హెల్మెట్ మధ్య మొబైల్ ఉంచి మాట్లాడుతుండగా పోలీసు పట్టుకున్నాడన్నారు. అలా చేసినందుకు రూ.500 జరిమానా కూడా విధించారని తెలిపాడు.
  • హెల్మెట్‌ల లోపల మొబైల్‌ను పెట్టుకుని మాట్లాడేవారిని చాలామందిని చూశానని, కానీ ఈ మహిళ కొత్తగా ఆలోచించిందని మరో వ్యక్తి కామెంట్ చేశారు. మొబైల్ పడిపోకుండా ఆమె చాలా జాగ్రత్తలు తీసుకుందని అభినందనలు తెలిపాడు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..