Viral Pic: అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్

|

Mar 29, 2024 | 3:55 PM

మనదేశంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు ఏమాత్రం కొదువ లేదు. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ లాంటి మెట్రో సిటీస్ లో టెకీల సంఖ్య కూడా ఎక్కువే. అయితే బెంగళూరు మాత్రం ఐటీ నిపుణులకు అడ్డ అని చెప్పవచ్చు. అయితే ప్రతినిత్యం కంప్యూటర్లతో కుస్తీలు పట్టే టెకీల ఫొటోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూనే ఉంటాయి.

Viral Pic: అయ్య బాబోయ్.. వీడెవడండి బాబు.. థియేటర్‌లో ల్యాప్‌టాప్‌తో వర్క్
Viral Pic
Follow us on

మనదేశంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు ఏమాత్రం కొదువ లేదు. ముంబై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ లాంటి మెట్రో సిటీస్ లో టెకీల సంఖ్య కూడా ఎక్కువే. అయితే బెంగళూరు మాత్రం ఐటీ నిపుణులకు అడ్డ అని చెప్పవచ్చు. అయితే ప్రతినిత్యం కంప్యూటర్లతో కుస్తీలు పట్టే టెకీల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. గతంలో తమ ల్యాప్ టాప్ లలో పనిచేస్తున్న వారి వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తాజాగా ఓ వ్యక్తి సినిమా థియేటర్ లో ల్యాప్ ట్యాప్ తో పనిచేస్తున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది.

రిషిక అనే యూజర్ ఓ థియేటర్లో పని చేస్తున్న ఫొటోను ఎక్స్ లో పోస్ట్ చేస్తూ ‘నిన్న సినిమాకి వెళ్లగా, ఓ వ్యక్తి సినిమా చూడకుండా ల్యాప్ టాప్ తో పనిచేస్తూ కనిపించాడు. ఆ వ్యక్తి యానిమేటెడ్ చిత్రం కుంగ్ ఫూ పాండా చూసేందుకు వచ్చాడని క్యాప్సన్ ఇచ్చాడు. ఈ పోస్ట్ ఆమె షేర్ చేసిన కొద్దిసేపటికే సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

నెటిజన్స్ ద్రుష్టిని ఆకర్షించింది. వర్క్-లైఫ్ బ్యాలెన్స్ గురించి గొప్పగా ఉందని ఓ నెటిజన్స్ కామెంట్ చేయగా, “అతను వర్క్ హోం చేస్తున్నాడేమోనని కామెంట్స్ చేశారు మరికొందరు. ‘పీక్ బెంగళూరు’ అని, సినిమా ముగిసేలోగా వర్క్ పూర్తి చేయండి.. అంటూ కామెంట్లు చేశారు. అలాగే, కొన్ని నెలల క్రితం ఓ మహిళ ల్యాప్ ట్యాప్ లో పనిచేస్తూ బైక్ పై వెళ్తుండగా అది సోషల్ మీడియాలో వైరల్ గా మారిన విషయం తెలిసిందే.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి