కప్పని పాము మింగిన సందర్బాలు మీరు చాలాసార్లు చూసి ఉంటారు. కానీ పామును, మరో పాము మింగడం మాత్రం చాలా అరుదనే చెప్పారలి. అయితే, ఒక జాతికి చెందిన జంతువు, అదే జాతి జంతువును తినడాన్ని కానిబాలిజం అని అంటారు. తాజాగా ఒడిశాలో ఇలాంటి అరుదైన సంఘటన ఒకటి చోటుచేసుకుంది. 3 అడుగుల కోబ్రాను 4 అడుగుల తాచుపాము మింగేసింది. స్నేక్ క్యాచర్స్ తాచుపామును పట్టుకునే ప్రయత్నంలో మింగిన కోబ్రాను బయటకి కక్కేసింది. ఈ ఘటన స్థానికులను షాక్‌కు గురిచేసింది. ఒడిశాలోని ఖుర్దా జిల్లా, బాలాకటి గ్రామంలో పాము తిరగడం గుర్తించిన స్థానికులు స్నేక్ హెల్ప్ లైన్‌కు కాల్ చేసి సమాచారం అందించారు. వారు అక్కడకు చేరుకుని 4 అడుగుల తాచు పామును సేఫ్‌గా పట్టుకునేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలోనే తాచుపాము 3 అడుగుల కోబ్రాని బయటకు కక్కింది. ఈ అరుదైన ఘటనను చూసేందుకు స్థానికులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో కూడా నెట్టింట బాగా వైరల్ అవుతుంది.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో తాచు పాము హల్చల్ చేసింది. పాల్వంచ లోని ఆడమ్స్ ఇంజనీరింగ్ కాలేజీ సమీపంలో ఒక రైస్ మిల్ దగ్గర బావి లో పడిన పాముని గమనించిన స్థానికులు గుర్తించారు. వెంటనే స్నేక్ క్యాచర్ సంగ్యయకు సమచారం అందించారు. ఆ సమాచారం తెలుసుకున్న స్నేక్ క్యాచర్ సంగ్యయ, చాకచక్యంగా పాముని బయటకి తీశాడు. పాముని సేఫ్‌గా అడివిలో వదిలేయంటంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. పాల్వంచ కేటీపీఎస్ లో ఆర్టిజన్ గా సంగయ్య పని చేస్తున్నసంగయ్య… ఇప్పటివరకు సుమారు ఐదు వందల పాములు పైనే పట్టాడట.
Also Read: డొంకకు పెట్టిన మంట పెళ్లి ఇంటికి చేరింది.. చివరకు బుగ్గే మిగిలింది