Viral News: వైకల్యంలో బాధ పడుతున్న ఓ యువతి తన తల్లి గర్భంతో ఉన్న సమయంలో సరైన సలహాలు ఇవ్వలేదంటూ సంబంధిత డాక్టర్‌ను కోర్టుకు లాగింది. తన తల్లికి తాను లోపంతో జన్మించడానికి ఆ డాక్టర్ కారణమైందని, సరైన సలహా ఇచ్చిఉంటే తాను జన్మించి ఉండేదాన్ని కాదంటూ తాను వేసిన పిటిషన్‌లో పేర్కొంది. వివరాల్లోకెళితే.. యూకే కి చెందిన ఈవీ టూంబ్స్.. స్పైనా బిఫిడా అనే లోపంతో జన్మించింది. అంటే.. వెన్నెముక సరిగా ఏర్పకుండా లోపంతో పుట్టడం అనమాట. ఈ సమస్య కారణంగా.. ఆమె రోజు మెడికల్ ట్యూబ్‌లను అమర్చుకొని తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ జీవనం గడుపుతోంది.
అయితే, తన తల్లి ప్రెగ్నెన్సీతో ఉన్న సమయంలో సంబంధిత డాక్టర్ సరైన సూచనలు ఇస్తే.. తనకు ఇలాంటి పరిస్థితి ఉండేది కాదని ఈవీ టూంబ్స్ భావించింది. సరైన సూచనలు ఇవ్వనందునే తనకు ఈ పరిస్థితి ఎదురైందని డాక్టర్ ఫిలిప్ మిచెల్‌పై ఆరోపణలు చేసింది. అంతటితో ఆగకుండా తనకు నష్ట పరిహారం చెల్లించాలని కోర్టులో దావా వేసింది ఈవీ టూంబ్స్. తాను పోషక ఆహారం తీసుకుంటే.. ఫోలిక్ యాసిడ్ తీసుకోవాల్సిన అవసరం లేదని డాక్టర్ సలహా ఇచ్చినట్లు ఈవీ తల్లి పేర్కొంది. దాని ఆధారంగా.. ఈవీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ కేసును విచారించిన లండన్ హైకోర్టు న్యాయమూర్తి రోసలిండ్ కో క్యూసి.. ఈవీ టూంబ్స్ ఆరోపణలను సమర్థించారు. ఆమె తల్లికి ముందుగానే సరైన సలహా ఇచ్చి ఉంటే ఈవీ టూంబ్స్.. స్పైనా బిఫిడా లోపంతో జన్మించి ఉండేది కాదని తీర్పు నిచ్చారు. టూంబ్స్ కోరిన విధంగా తగిన నష్ట పరిహారం చెల్లించాలని డాక్టర్‌ను కోర్టు ఆదేశించింది. తీవ్రమైన ఆరోగ్య సమస్యతో పిల్లల పుట్టుకకు దారితీసే తప్పుడు సలహాలకు ఆరోగ్య సంరక్షణ నిపుణులు బాధ్యత వహించాల్సి ఉంటుందని కోర్టు స్పష్టం చేసింది.
ఇక ఈవీ టూంబ్స్ దివ్యాంగ ‘షో జంపర్’గా పలు పోటీల్లో పాల్గొంటూ.. దివ్యాంగులకు రోల్ మోడల్‌గా నిలుస్తోంది. టూంబ్స్‌కి సోషల్ మీడియాలోనూ విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. చాలామందికి సుపరిచితం కూడా. తన అభిమానుల కోసం టూంబ్స్.. తన జీవిత ప్రయాణాన్ని డాక్యూమెంట్ చేస్తుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమెకు 21 వేల మందికిపైగా ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్‌స్టా లో ఆమె తన రోజువారీ జీవితం, వృత్తిపరమైన పనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను షేర్ చేస్తుంటుంది.
Also read:
HMDA: మూసీ తీరంలో కాసుల వర్షం.. ఉప్పల్ భగాయత్ గజం ఎంతో తెలుసా..
Hebah Patel: హెబ్బా పటేల్‌ను ఇలా ఎప్పుడైనా చూసారా ?? ఆకట్టుకుంటున్న కుమారి లేటెస్ట్ ఫొటోస్