Viral Video: పాములు అంటే భయపడని వారు ఎవరూ ఉండరు. చిన్న పాము పిల్ల కంటబడినా తుర్రమని పారిపోతుంటాం. అది మనను ఏం చేయదని తెలిసినా.? పామును చూడడానికి మనసు ఒప్పదు. అలాంటి ఓ 20 అడుగుల కొండ చిలువ ఇంట్లో, మన మధ్యే ఉంటే ఎలా ఉంటుంది.? ఏంటి.. ఊహించుకుంటేనే కాళ్లు వణుకుతున్నాయి కదూ! కానీ నెట్టింట్ వైరల్ అవుతోన్న వీడియో మాత్రం పాము స్నేహితుడిగా మారితే ఎలా ఉంటుందో చెబుతోంది.
రాయల్ పైథాన్స్ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఓ భయంకరమైన వీడియోను పోస్ట్ చేశారు. ఓ పదేళ్ల కుర్రాడు ఇంట్లో సోఫాపై పడుకొని మొబైల్‌లో వీడియో గేమ్ ఆడుతున్నాడు. అదే సమయంలో 20 అడుగులు పెద్ద కొండ చిలువ సోఫా కింది నుంచి పాకుతూ కుర్రాడి పక్కన చేరింది. అక్కడితో ఆగకుండా కుర్రాడి పైనుంచి పాకుతూ వెళ్లింది. అయితే సదరు బాలుడు మాత్రం తనకు ఏం సంబంధం లేదన్నట్లు ఫోన్‌లో గేమ్ ఆడుతూ ఉన్నాడు. దీనిని అక్కడే ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
దీంతో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. అసలు ఆ పాము కుర్రాడిని ఎందుకు ఏం అనట్లేదు.? ఆ కుర్రాడు ఎందుకు భయ పడడం లేదనే అనుమానాలు నెటిజన్లు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఈ వైరల్ వీడియో చూస్తే మాత్రం ఒళ్లు జలదరిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మరి నెట్టింట వైరల్ అవుతోన్న ఈ వీడియోపై మీరూ ఓ లుక్కేయండి..
3 Roses AHA: అసలు ఒకరి నీడలో బతకాల్సిన అవసరం అమ్మాయిలకు ఎందుకు.? ఆకట్టుకుంటోన్న 3 రోజెస్ ట్రైలర్..
దిగజారి పోస్టులు చేస్తున్నారు.. ఎందుకు ఇలా.. మార్పు రావాల్సిందే..