Trending: 90 ఏళ్ల వయసులో పాకిస్తాన్ కు పయనం.. వాఘా – అట్టారీ బార్డర్ వద్ద బామ్మ భావోద్వేగం

|

Jul 18, 2022 | 1:07 PM

భారతదేశానికి చెందిన 90 ఏళ్ల వృద్ధురాలు తన పూర్వీకుల నగరమైన పాకిస్తాన్ (Pakistan) లోని రావల్పిండిని (Rawalpindi) సందర్శించేందుకు వాఘా-అట్టారీ సరిహద్దు దాటి పాకిస్తాన్ కు చేరుకుంది. 1947లో దేశ విభజన జరిగిన సమయంలో రీనా చిబ్బర్....

Trending: 90 ఏళ్ల వయసులో పాకిస్తాన్ కు పయనం.. వాఘా - అట్టారీ బార్డర్ వద్ద బామ్మ భావోద్వేగం
Pakisthan Woman
Follow us on

భారతదేశానికి చెందిన 90 ఏళ్ల వృద్ధురాలు తన పూర్వీకుల నగరమైన పాకిస్తాన్ (Pakistan) లోని రావల్పిండిని (Rawalpindi) సందర్శించేందుకు వాఘా-అట్టారీ సరిహద్దు దాటి పాకిస్తాన్ కు చేరుకుంది. 1947లో దేశ విభజన జరిగిన సమయంలో రీనా చిబ్బర్ వర్మ.. వయసు కేవలం 15 ఏళ్లు. ఇండియాకు స్వాతంత్ర్యం రావడం, అఖండ్ భారత్ విడిపోవడం వంటి కారణాలతో ఆమె పాకిస్తాన్ నుంచి భారత్ కు వచ్చారు. తిరిగి పాకిస్తాన్ లోని కుటుంబసభ్యుల వద్దకు వెళ్లేందుకు ఆమె 1965లో వీసా కోసం దరఖాస్తు చేసింది. ఆ ప్రతిపాదనను ఆ దేశం తిరస్కరించింది. ఈ క్రమంలో గతేడాది సోషల్ మీడియాలో తన పూర్వీకుల ఇంటికి వెళ్లాలని ఉందని రీనా తన కోరికను వెల్లడించారు. పాకిస్తాన్ కు చెందిన సజ్జాద్ హైదర్.. ఆమెను సంప్రదించి రావల్పిండిలోని ఆమె ఇంటి చిత్రాలను పంపించారు. వాటిని చూసిన తర్వాత అవి తన పూర్వీకుల ఇల్లేనని రీనా గుర్తించింది. దీంతో ఎలాగైనా స్వస్థలానికి వెళ్లాలని నిర్ణయించుకుంది. దేశ విభజన జరిగినప్పుడు రీనా.. తన కుటుంబంతో కలిసి రావల్పిండిలోని దేవి కాలేజీ రోడ్‌లో నివాసమున్నట్లు ఆమె చెప్పారు.

నేను మోడరన్ స్కూల్లో చదివాను. నా నలుగురు తోబుట్టువులు కూడా అదే స్కూల్లో చదివారు. మా అన్నయ్య, చెల్లి కూడా మోడరన్ స్కూల్ దగ్గర ఉన్న గోర్డెన్ కాలేజీలో చదివారు. మా నాన్నకు అభ్యుదయ భావాలు ఎక్కువ. విభజనకు ముందు హిందూ, ముస్లిం అనే తేడా లేదు. దేశం విడిపోయాక ఈ సమస్య ఎక్కువైంది. నా పాత ఇంటిని మళ్లీ చూడాలనే ఉత్సాహంతో ఉన్నాను. కానీ నా కుటుంబాన్ని తీవ్రంగా కోల్పోతున్నాను. ఎనిమిది మంది ఉన్న కుటుంబంలో నేనొక్కడాన్నే ప్రాణాలతో మిగిలాను.

       – రీనా చిబ్బర్ వర్మ

ఇవి కూడా చదవండి

తాజాగా ఆమె మళ్లీ పాకిస్తానీ వీసా కోసం దరఖాస్తు చేసుకోగా అది తిరస్కరించబడింది. ఆమె తన అభిప్రాయాన్ని పాకిస్తాన్ విదేశాంగ శాఖ సహాయ మంత్రి హీనా రబ్బానీ ఖార్‌కి ట్యాగ్ చేశారు. ఈ ట్వీట్ పై మంత్రి స్పందించి వీసాను సులభతరం చేశారు.

మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి