సైలోసిబిన్ పుట్టగొడుగులు.. ఈ పేరు మీరెప్పుడైనా విన్నారా.! దీన్నే మ్యాజిక్ మష్రూమ్‌లని పిలుస్తుంటారు. ఇక ఓ అసాధారణమైన కేసు గురించి ‘మెగా జర్నల్ ఆఫ్ సర్జరీ’ జర్నల్‌లో ప్రచురితమైంది. సైలోసిబిన్ పుట్టగొడుగులు తినడం వల్ల ఎంతటి ప్రమాదం చోటు చేసుకుంటుందోనని ఓ నివేదికలో పేర్కొంది. ఈ మ్యాజిక్ మష్రూమ్‌లు తిన్న ఓ ఆస్ట్రియన్ వ్యక్తి.. మైకంలో మునిగిపోయి.. తన జననేంద్రియాలను గొడ్డలితో నరికేశాడు. ఇంతకీ ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు తెలుసుకుందామా..
న్యూయార్క్ పోస్ట్ ప్రకారం, అతిగా మద్యానికి బానిసై, డిప్రెషన్‌తో బాధపడుతున్న 37 ఏళ్ల ఆస్ట్రియన్ వ్యక్తి సెలవుల్లో ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు నాలుగైదు ఎండిన సైలోసిబిన్ పుట్టగొడుగులను తిన్నాడు. ఈ పుట్టగొడుగును తిన్న వెంటనే.. అతడికి తీవ్రమైన భ్రాంతులు, మనసులో అలజడి మొదలైంది. తద్వారా అతడు తీసుకున్న నిర్ణయం.. అందరిని షాక్‌కు గురి చేసింది. గొడ్డలితో ఆ వ్యక్తి తన ప్రైవేటు పార్ట్‌ను ముక్కలు ముక్కలుగా నరికాడు. ఘటన అనంతరం తీవ్ర రక్తస్రావంతో ఉన్న అతడు.. తాను కట్ చేసిన జననాంగాలను మంచుతో చుట్టి ఒక కూజాలో పెట్టి.. ఇంటి నుంచి బయటకొచ్చాడు. దిక్కుతోచని స్థితిలో ఉన్న అతడ్ని ఓ అజ్ఞాత వ్యక్తి.. సదరు బాధితుడ్ని ఆస్పత్రిలో అడ్మిట్ చేశాడు. గాయాలు తీవ్రం కావడం, అలాగే రక్తస్రావం విపరీతంగా ఉండటంతో.. అతడికి శస్త్రచికిత్స చేసేందుకు డాక్టర్లు పలు సవాళ్లు ఎదుర్కున్నారు. వైద్యులు తెగిపోయిన జననేంద్రియాలను తిరిగి అమర్చారు. ఇక ఆపరేషన్ అనంతరం ఆ వ్యక్తి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెప్పారు. ఆపై వ్యక్తిని సైకియాట్రిక్ వార్డులో చేర్చి చికిత్స అందించారు. సైలోసిబిన్ పుట్టగొడుగులను తింటే ఎంతటి భయంకరమైన పరిణామాలు ఉంటాయో ఈ ఘటన రుజువు చేసింది. తిని భ్రమపడి ఆ వ్యక్తి జననాంగాలను కోసుకున్నాడని, ఈ వింత ఉదంతం మెగా జర్నల్ ఆఫ్ సర్జరీ జర్నల్‌లో ప్రచురితమైందని వెలుగులోకి వచ్చింది. నిరాశ, ఆందోళన వంటి రుగ్మతలకు చికిత్స చేయడానికి సైలోసిబిన్ ఎక్కువగా ఉపయోగించబడుతుందని డాక్టర్లు చెప్పారు.
మేజిక్ మష్రూమ్ అనేది ఒక రకమైన పుట్టగొడుగు. ఇందులో సైలోసిబిన్ అనే సహజసిద్ధమైన సమ్మేళనం ఉంటుంది. ఈ పుట్టగొడుగును తీసుకుంటే, అది మెదడుపై చెడు ప్రభావాన్ని చూపుతుంది. ఒక వ్యక్తిని మతిమరుపు స్థితిలో ఉంచుతుంది. వ్యక్తి ఆలోచించే సామర్థ్యాన్ని కోల్పోతాడు. ప్రత్యేకంగా, ఈ పుట్టగొడుగును అనేక వ్యాధులకు ఔషధంగా కూడా ఉపయోగిస్తారు. డిప్రెషన్, ఇతర వ్యాధులకు సమర్థవంతమైన చికిత్సగా ఉండే ఈ మ్యాజిక్ మష్రూమ్‌ను వైద్యుల సలహా లేకుండా తినకూడదని కూడా అంటారు.
ఇది చదవండి: ఇలా ఉన్నారేంట్రా.! ప్రీ వెడ్డింగ్ షూట్‌లో పని కానిచ్చేశారు.. ముద్దులతో రచ్చోభ్య:
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..