Bengaluru Building collapses Video: భారీ వర్షాలకు దేశంలోని పలు ప్రాంతాల్లో చాలా భవనాలు కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఈ ఘటనల్లో పదుల సంఖ్యలో బాధితులు మరణించారు. ఈ ఘటనలు మరువక ముందే.. కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో యజమాని నిర్లక్ష్యంతో మరో భవనం కూలిపోయింది. ఇక్కడి కస్తూరినగర డాక్టర్స్ లేఔట్‌లో మూడంతస్తుల భవనం గురువారం పక్కకు ఒరిగిపోయింది. కొద్ది రోజుల నుంచి భవనం కొద్ది కొద్దిగా ఒరుగుతుండటంతో అందులో నివాసం ఉంటుంన్న వారు ఖాళీ చేశారని అధికారులు తెలిపారు. ముందస్తుగా ఖాళీ చేయడంతో పెనుప్రమాదం తప్పినట్లు అధికారులు వెల్లడించారు. భవనం గురువారం తెల్లవారుజామున భవనం ఒకవైపు పూర్తిగా కూలిపోయినట్లు తెలిపారు. భవనం పునాదిలో లోపం ఉందని.. బెంగళూరు మునిసిపల్ అధికారులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
ఈ మూడంతస్తుల భవనం గత ఏడు సంవత్సరాలుగా ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (OC) లేదని, అయినప్పటికీ.. ప్లాట్లల్లో విద్యుత్, నీటి కనెక్షన్‌లను అక్రమంగా ఏర్పాటు చేశారని అధికారులు తెలిపారు. భవనం అక్రమంగా నిర్మించడంతోపాటు.. అనుమతులు ఇవ్వడంపై అసిస్టెంట్ ఇంజనీర్ శంకరప్పను సస్పెండ్ చేశారు. బెంగుళూరు తూర్పులోని కస్తూరినగర్‌లో ఉన్న ఈ మూడంతస్థుల సన్‌షైన్ అపార్ట్‌మెంట్‌ను ఆయేషా బైగ్, మహ్మద్ ఆసిఫ్ బిల్డర్లు నిర్మించారని తెలిపారు. ఈ భవనంలో ఎనిమిది ఫ్లాట్లు ఉన్నాయని.. 2014లో వాటిని విక్రయించారని తెలిపారు.
కుప్పకూలిన మూడంతస్థుల భవనం..వీడియో
#WATCH – A multistorey building collapsed in Kasturi Nagar area of bengaluru ,no casualties reported.. pic.twitter.com/d7IVM5K4gx
— Yasir Mushtaq (@path2shah) October 7, 2021
ఈ క్రమంలో భవనం చిన్నగా ఒరగడం మొదలైందని.. గురువారం పూర్తిగా ఒరుతుండటంతో స్థానికులు పోలీసులకు, మునిసిపల్ అధికారులకు సమాచారమిచ్చారని తెలిపారు. అనంతరం అక్కడికి చేరుకున్న మునిసిపల్ అధికారులు సిబ్బందితో సహాయక చర్యలు చేపట్టారు. అయితే.. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. దోషులపై కేసు నమోదు చేశామని.. చర్యలు తీసుకుంటామని తెలిపారు. ముందస్తుగా నివాసితులను అక్కడి నుంచి తరలించారు.
Also Read: