అమ్మమ్మ తెచ్చిన పెళ్లి సంబంధాన్ని వద్దన్న తల్లి.. అమ్మాయి ఫోటో చూసి తలపట్టుకున్న కాలేజీ కుర్రాడు!

21 ఏళ్ల వయసు, కాలేజీ చివరి సంవత్సరం, చేతిలో చిల్లిగవ్వ కూడా లేదు... ఇలాంటి పరిస్థితిలో ఇంటికి అకస్మాత్తుగా పెళ్లి ప్రతిపాదన వస్తే కుటుంబ సభ్యులు ఏం చెబుతారు? సహజంగానే, అతను ఇంకా చిన్నపిల్లాడు..లేదంటే, ముందు ఏదైనా సంపాదించుకోవాలి అని అంటారు. ఇలాంటి ఒక తమాషా సంఘటన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ రెడ్డిట్‌లో వైరల్‌గా మారింది. ఇక్కడ, ఒక కాలేజీ విద్యార్థి తల్లి అబ్బాయికి ప్రస్తుతం ఉద్యోగం లేదు అని చెబుతూ అతనికి వచ్చిన పెళ్లి ప్రపోజల్‌ని వెంటనే తిరస్కరించింది. కానీ, ఆ అబ్బాయి సీక్రెట్‌గా ఆ అమ్మాయి ఫోటోను చూడటంతో అసలు డ్రామా మొదలైంది. ఏం జరిగిందో తెలియాలంటే పూర్తి డిటెల్స్‌లోకి వెళ్లాల్సిందే..

అమ్మమ్మ తెచ్చిన పెళ్లి సంబంధాన్ని వద్దన్న తల్లి.. అమ్మాయి ఫోటో చూసి తలపట్టుకున్న కాలేజీ కుర్రాడు!
Viral Marriage Proposal

Updated on: Jul 16, 2026 | 6:30 PM

సాధారణంగా 21 ఏళ్ల వయస్సు అంటే కాలేజీ చదువులు, కెరీర్ ప్లానింగ్‌లో బిజీగా ఉంటారు. ఆ వయసులో ఉద్యోగం లేకుండా జేబు ఖాళీగా ఉన్నప్పుడు హఠాత్తుగా పెళ్లి సంబంధం వస్తే ఏ తల్లిదండ్రులైనా ఏం చేస్తారు..మా అబ్బాయి ఇంకా చిన్న పిల్లాడే అని తిరస్కరిస్తారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ రెడిట్ లో వైరల్ అయిన ఒక పోస్ట్‌ కూడా సరిగ్గా ఇదే తరహాలో సాగింది. కానీ, ఇందులో ట్విస్ట్ ఏంటంటే.. తల్లి సంబంధాన్ని తిరస్కరించిన తర్వాత అమ్మాయి ఫోటో చూసిన కొడుకు పశ్చాత్తాపం చెందుతూ పోస్ట్ పెట్టడం నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అసలేం జరిగిందంటే..

కాలేజీ చదువు పూర్తికాకుండానే పెళ్లి సంబంధం రావడం, దానికి తల్లి నో చెప్పడం, ఆపై వరుడు పడిన ఆరాటం గురించిన ఒక సరదా ఉదంతం సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ రెడిట్ లో తెగ వైరల్ అవుతోంది. 21 ఏళ్ల ఒక యువకుడు కాలేజీ చివరి సంవత్సరంలో ఉండగా, అతని అమ్మమ్మ స్నేహితురాలి ద్వారా ఒక సంబంధం వచ్చింది. అబ్బాయి ఇంకా చదువుకుంటున్నాడని, ఉద్యోగం లేదనే కారణంతో అతని తల్లి వెంటనే ఆ సంబంధాన్ని నిరాకరించింది. అయితే, తర్వాత ఆ అమ్మాయి ఫోటో చూసిన సదరు యువకుడు.. ఆమె అందానికి మైమరచిపోయి, కనీసం నన్నైనా ఒక మాట అడగాల్సింది అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

వైరల్‌గా మారిన పోస్ట్ వివరాల ప్రకారం.. ఒక 21 ఏళ్ల కాలేజీ కుర్రాడికి హఠాత్తుగా అతని అమ్మమ్మ ద్వారా పెళ్లి సంబంధం వచ్చింది. అమ్మమ్మ స్నేహితురాలు తన 20 ఏళ్ల మనవరాలిని ఈ కుర్రాడికి ఇచ్చి పెళ్లి చేయాలని ఎంతో ఉత్సాహపడింది. అమ్మమ్మకు తన స్నేహితురాలిని స్వయంగా నిరాకరించడం ఇష్టం లేక, ఆ విషయాన్ని అబ్బాయి తల్లికి చెప్పింది. ప్రస్తుతం కొడుకు ఇంకా కాలేజీ చదువు పూర్తి చేయలేదని, చేతిలో ఉద్యోగం లేదని గ్రహించిన తల్లి ఏమాత్రం ఆలోచించకుండా ఆ సంబంధానికి నేరుగా నో చెప్పేసింది.

ఇవి కూడా చదవండి

తల్లి ఆ సంబంధాన్ని నిరాకరించిన విషయం తెలుసుకున్న సదరు యువకుడు మొదట నవ్వుకున్నాడు. కానీ, ఆ తర్వాత అనుకోకుండా ఆ అమ్మాయి ఫోటో చూడటంతో అతని ప్రపంచమే మారిపోయింది. ఆమె అమాయకమైన రూపం, అందమైన చిరునవ్వు చూసి మనసు పారేసుకున్నాడు. నాకు ఆ అమ్మాయి అందం ఎంతగా నచ్చిందంటే.. ఆమె ఆ చిరునవ్వు కోసం నా ప్రాణాలనైనా ఇచ్చేయాలనిపించింది. అమ్మ కనీసం సంబంధం తిరస్కరించే ముందు నన్ను ఒక్క మాట అడిగి ఉండాల్సింది అని సదరు యువకుడు తన పోస్ట్‌లో ఆవేదన వ్యక్తం చేశాడు.

I got a marriage proposal yesterday but mom rejected it
by
u/Sysyphus_aint_happy in
TwentiesIndia

ఈ పోస్ట్ నెట్టింట ప్రత్యక్షం కాగానే నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతూ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. కొందరు యూజర్లు చాలా సరదాగా స్పందిస్తూ..వెంటనే వెళ్లి మీ అమ్మతో మాట్లాడి ఆ సంబంధం మళ్లీ కుదిరేలా చూడమని చెప్పు, లేదంటే నువ్వు ఆ అమ్మాయి ఆలోచనల నుండి బయటపడలేవు అని సలహాలు ఇస్తున్నారు. మరికొందరు మాత్రం.. కెరీర్‌పై దృష్టి పెట్టకుండా ఈ వయసులో పెళ్లి చేసుకోవడం సరైంది కాదు, మీ అమ్మ తీసుకున్న నిర్ణయం నూటికి నూరు శాతం కరెక్ట్ అని హితవు పలుకుతున్నారు.

మరో యూజర్ ఇలా అన్నారు, ఇది దేశంలోని ప్రతి మధ్యతరగతి అబ్బాయి కథ, మన గుండె కొట్టుకుంటుంది.. కానీ, మన ఖాళీ జేబుల విషయంలో నిర్ణయాలు తీసుకునేది మన తల్లిదండ్రులే. ఏదేమైనా ఈ సరదా ప్రేమ తపన ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us