
ఒడిశాలోని పూరి జిల్లా నుండి ఒక ఆశ్చర్యకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఇక్కడ, ఒక స్నేక్ క్యాచర్ ఇంట్లో ఒకటి, రెండు కాదు.. ఒకేసారి పదుల సంఖ్యలో నాగుపాము పిల్లలు పుట్టాయి. ఈ పాముల వీడియో బయటకు రావడంతో సోషల్ మీడియా వినియోగదారులు షాక్ అయ్యారు. ఈ సంఘటన కాకత్‌పూర్ ప్రాంతానికి చెందినదిగా తెలిసింది.. 19 కోబ్రా పాములు జన్మించిన ఇంట్లో ఉన్న వ్యక్తి ఆ పాములను రక్షించాడు. కొద్ది రోజుల క్రితం ఈ కోబ్రాలకు జన్మనిచ్చిన ఆడ పామును కూడా అతడే రక్షించాడని తెలిసింది.
సెప్టెంబర్ 12 శుక్రవారం రోజున పూరి జిల్లాలో ఒక ఆడ పాము గుడ్ల నుండి ఒకేరోజున 19 కోబ్రా పిల్లలు జన్మించాయి. కొన్ని రోజుల క్రితం స్నేక్ హెల్ప్‌లైన్ సభ్యుడు బ్రజ్ కిషోర్ సాహు అనే వ్యక్తి ఒక కోబ్రా ఆడ పామును రక్షించాడు. ఆ సమయంలో ఆ ఆడ పాము గర్భవతిగా ఉండటం గ్రహించాడు. దాంతో బ్రజ్ కిషోర్ సాహు ఆ ఆడ పామును ప్లాస్టిక్ జాడిలో సురక్షితంగా ఉంచాడు. సరిగ్గా రెండు రోజుల తర్వాత ఆడ పాము 19 గుడ్లు పెట్టింది. ఆడ పాము గుడ్లు పెట్టిన వెంటనే, బ్రజ్ కిషోర్ సాహు ఆడ పామును అడవిలో వదిలేశాడు.
కానీ, ఆ నాగుపాము గుడ్లను బ్రజ్ కిషోర్ సాహు భద్రంగా ఉంచారు. ఈ సంఘటన జరిగిన దాదాపు 60 రోజుల తర్వాత, ఆ గుడ్ల నుండి 19 పిల్లలు బయటకు వచ్చాయి. అయితే, ఈ పిల్లలు చాలా విషపూరితమైనవి. ఆ పాము పిల్లలను ప్లాస్టిక్ జాడి నుండి జాగ్రత్తగా బయటకు తీశారు. దీని తరువాత, వాటిని కూడా అడవిలో సురక్షితంగా వదిలివేస్తారు.
మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..