Viral News: ఆ స్కూల్‌ నిండా కవలపిల్లలే..! ఒకటో తరగతిలోనే సరికొత్త రికార్డ్‌..

|

Aug 15, 2023 | 4:12 PM

స్కూల్‌ సిబ్బంది ఒకరు మాట్లాడుతూ... కవలలను స్వాగతించడానికి ప్రతి సంవత్సరం ఇన్వర్‌క్లైడ్ లేదా ట్విన్‌వాక్లైర్డ్‌లో వార్షిక కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. వచ్చేవారం ఫస్ట్ క్లాస్ లో కొత్త బ్యాచ్ రానుండటం, కవలల రాకతో ఇక్కడ ఉత్కంఠ నెలకొంది. స్కూల్ యూనిఫారంలో వారందరినీ చూడాలని ఎదురు చూస్తున్నాను. ఇది పిల్లల తల్లిదండ్రులకు కూడా సంతోషం కలిగించే విషయమన్నారు. గతంలో కేరళలోని కొండిని గ్రామం అత్యధిక కవలలను కలిగి ఉండటంతో వార్తల్లో నిలిచింది. ఇక్కడ దాదాపు 550 మంది కవలలు ఉన్నారు. ఇక్కడ జరిగే ప్రతి వెయ్యి మంది జననాలలో 40 మంది కవలలకు జన్మనిస్తున్నారు.

Viral News: ఆ స్కూల్‌ నిండా కవలపిల్లలే..! ఒకటో తరగతిలోనే సరికొత్త రికార్డ్‌..
Most Twins
Follow us on

కవలల ప్రపంచం ఒక అద్భుతం.. కవలలు అంతా ఒకేలా ఉంటారని, ఎప్పుడూ కలిసే చేసుకుంటారని నమ్మకం. ఒకరినొకరు విడిచిపెట్టి ఉండలేరని అంటారు. ఈ కవలలు రెండు శరీరాలు వెరైనా, ఒకే ప్రాణంలా జీవిస్తారని అనుకుంటారు. సాధారణంగా ఒక పాఠశాలలో ఒక జంట కవలలు లేదా ఒక పట్టణంలో ఒక కుటుంబంలో ఒక జంట కవలలు లేదంటే, ఒక ఊళ్లో ఐదారు జంటల కవలలలు అరుదుగా కనిపిస్తారు. అయితే ఈ పాఠశాలలో 17 మంది కవలలు ఒకటో తరగతిలో చేరిన ఘటన ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించింది. ఈ 17 జతల కవలలు స్కాట్లాండ్‌లోని ఒక పాఠశాలలో చదువుతున్నారు. ఇన్వర్‌క్లైడ్ ప్రాంతంలోని ఒక స్కూల్‌ ప్రతి సంవత్సరం కవలలను నమోదు చేయడం ద్వారా రికార్డు సృష్టించింది. అయితే ఈసారి 17 సెట్ల కవలలు పాఠశాలలో చేరి సరికొత్త రికార్డు సృష్టించారు. ఇప్పటికే 147 సెట్ల కవలలు ఇక్కడ వివిధ తరగతుల్లో చదువుతుండగా, ఈ 17 సెట్ల కవలలు ఆ జాబితాలోకి కొత్తగా చేరారు. దీంతో అత్యధిక కవలలు ఉన్న పాఠశాలగా ఆవిర్భవించింది.

నివేదిక ప్రకారం 2015లో 19 జతల కవలలను పాఠశాలలో చేర్పించడం ద్వారా స్కూల్‌ రికార్డు సృష్టించింది. ఇలా అత్యధికంగా కవలలు ఉన్న సెయింట్ ప్యాట్రిక్స్ ఫ్రైమేరీ స్కూల్లో ఈ 17 జతల కవలల్లో 15 మంది తమ స్కూల్ ప్రోగ్రాం నేపథ్యంలో కలిసి ఉన్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇన్వర్‌క్లైడ్ ప్రాంతంలో ఉన్న సెయింట్ పాట్రిక్స్ స్కూల్, అర్డగోవన్ ప్రైమరీ స్కూల్‌లు ప్రతి సంవత్సరం ప్రత్యేక సంఖ్యలో విద్యార్థులను స్వాగతిస్తున్నాయి. అందువల్ల, కవలలను ప్రత్యేకంగా స్వాగతించే ఆచారం ఇక్కడ అమల్లో ఉంది. అలాగే ఇన్వర్‌క్లైడ్ ఇప్పుడు ట్వినర్‌క్లైడ్‌గా ప్రసిద్ధి చెందింది.

స్కూల్‌ సిబ్బంది ఒకరు మాట్లాడుతూ… కవలలను స్వాగతించడానికి ప్రతి సంవత్సరం ఇన్వర్‌క్లైడ్ లేదా ట్విన్‌వాక్లైర్డ్‌లో వార్షిక కార్యక్రమం జరుగుతుందని చెప్పారు. వచ్చేవారం ఫస్ట్ క్లాస్ లో కొత్త బ్యాచ్ రానుండటం, కవలల రాకతో ఇక్కడ ఉత్కంఠ నెలకొంది. స్కూల్ యూనిఫారంలో వారందరినీ చూడాలని ఎదురు చూస్తున్నాను. ఇది పిల్లల తల్లిదండ్రులకు కూడా సంతోషం కలిగించే విషయమన్నారు.

ఇవి కూడా చదవండి

గతంలో కేరళలోని కొండిని గ్రామం అత్యధిక కవలలను కలిగి ఉండటంతో వార్తల్లో నిలిచింది. ఇక్కడ దాదాపు 550 మంది కవలలు ఉన్నారు. ఇక్కడ జరిగే ప్రతి వెయ్యి మంది జననాలలో 40 మంది కవలలకు జన్మనిస్తున్నారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..