రోహింగ్యా శిబిరంలో 15 కు చేరిన అగ్ని ప్రమాద మృతులు, 400 మంది ఆచూకీ గల్లంతు, 45వేల మందికి పైగా నిర్వాసితులు

Rohingya Camp Blaze In Bangladesh : బంగ్లాదేశ్‌లోని రోహింగ్యా శరణార్ధుల శిబిరంలో జరిగిన అగ్ని ప్రమాదం మృతులు 15కు చేరారు. తాజా సమాచారం ప్రకారం ఈ ఘటనలో..

రోహింగ్యా శిబిరంలో 15 కు చేరిన అగ్ని ప్రమాద మృతులు,  400 మంది ఆచూకీ గల్లంతు, 45వేల మందికి పైగా నిర్వాసితులు
Rohingya Camp Bangladesh
Follow us

|

Updated on: Mar 23, 2021 | 10:15 PM

Rohingya Camp Blaze In Bangladesh : బంగ్లాదేశ్‌లోని రోహింగ్యా శరణార్ధుల శిబిరంలో జరిగిన అగ్ని ప్రమాదం మృతులు 15కు చేరారు. తాజా సమాచారం ప్రకారం ఈ ఘటనలో 400 మంది ఆచూకీ తెలియటం లేదని, అగ్ని ప్రమాదం కారణంగా 45వేల మందికి పైగా నిరాశ్రయులయ్యారని ఐక్యరాజ్యసమితి వర్గాలు వెల్లడించాయి. ఇదిలాఉంటే, దేశం కాని దేశంలో తలదాచుకుంటున్న వారిపై విధి పగబట్టింది. బంగ్లాదేశ్‌లోని కాక్స్ బజార్ జిల్లాలో ఏర్పాటు చేసిన రోహింగ్యాల శరణార్థి శిబిరం ప్రపంచంలోనే అతి పెద్ద రెఫ్యూజీ క్యాంప్. మయన్మార్‌ నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయి వచ్చిన పది లక్షల మంది ఇక్కడ తలదాచుకుంటున్నారు. ఐక్యరాజ్య సమితి రోహింగ్యా రెఫ్యూజీల కోసం టెంట్లు నిర్మించడంతో పాటు వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తోంది. ఈ క్యాంప్‌లో అగ్ని ప్రమాదం జరగడంతో గంటల వ్యవధిలోనే వందల గుడారాలు తగలబడిపోయాయి.

ఉవ్వెత్తున లేచిన ప్రమాదానికి భయపడిన శరణార్దులు ప్రాణాలు కాపాడుకునేందుకు పిల్లల్ని, అయిన వాళ్లను వదిలి ఎటు పడితే అటు పరుగులు తీశారు. దీంతో చాలా మంది తమ వారెక్కడ ఉన్నారో తెలియని పరిస్థితి. 2017 తర్వాత జరిగిన అతి పెద్ద ప్రమాదం ఇది. ఈ ఫైర్ యాక్సిడెంట్‌పై బంగ్లాదేశ్ ప్రభుత్వం ఎంక్వైరీకి ఆదేశించింది. అగ్ని ప్రమాదంలో చాలా వస్తువులు పూర్తిగా కాలిపోయాయి. 10వేల గుడారాలు పూర్తిగా తగలబడి పోయాయి. కాక్స్‌ బజార్ జిల్లాలోని 8వేల ఎకరాల్లో ఐక్యరాజ్య సమితి 34 శరణార్థి శిబిరాలను ఏర్పాటు చేసింది. ఇందులో ఒక క్యాంపులో ప్రమాదవ శాత్తూ చెలరేగిన మంటల్లో క్యాంప్ మొత్తం అగ్నికి ఆహుతై పోయింది.

మంటల్ని ఆర్పడంతో పాటు బాధితుల్ని కాపాడేందుకు అగ్నిమాపక సిబ్బంది 15 గంటల పాటు నిర్విరామంగా శ్రమించారు. గ్యాస్ సిలిండర్ పేలడం వల్లనే ప్రమాదం జరిగినట్లు పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదంలో బయట పడిన వారికి సాయం అందించేందుకు ఐక్యరాజ్య సమితి పది లక్షల డాలర్ల సాయం విడుదల చేసింది. అందరికి కనీస అవసరాలు తీరాలన్నా రెండు కోట్ల డాలర్లు అవసరం అంటున్నారు అధికారులు. రోహింగ్యా శరణార్ధుల్ని బంగాళాఖాతంలోని ఓ దీవికి తరలిస్తోంది బంగ్లాదేశ్ ప్రభుత్వం. ఇప్పటి వరకూ 13వేల మందిని అక్కడకు తరలించారు. ఈ దీవికి తుపానుల ముప్పు ఉందని తేలడంతో అక్కడకు వెళ్లేందుకు చాలామంది ముందుకు రావడం లేదు.

Read also : Collector Gandham Chandrudu : పలుగు, పార చేతపట్టిన అనంతపురం జిల్లా కలెక్టర్, ఉపాధి హామీ కూలిపనులపై ఆరా