Viral: నదిలో తేలుతోన్న ఐస్ బాక్స్.. తీరా డోర్ ఓపెన్ చేసి చూడగా ఫ్యూజులు ఔట్!
ఓ నదిలో ఐస్ బాక్స్ ఒకటి తేలుతోంది. రెస్క్యూ ఆపరేషన్ చేస్తోన్న అధికారులు దూరం నుంచి దాన్ని గమనించారు. మొదటిగా అది ఏమై..
ఓ నదిలో ఐస్ బాక్స్ ఒకటి తేలుతోంది. రెస్క్యూ ఆపరేషన్ చేస్తోన్న అధికారులు దూరం నుంచి దాన్ని గమనించారు. మొదటిగా అది ఏమై ఉంటుందని వాళ్లు అనుకున్నారు. దగ్గరకు రాగానే.. దాన్ని తాళ్లతో ఒడ్డుకు లాగారు. బురదతో నిండిన ఆ బాక్స్ డోర్‌ను ఓపెన్ చేసి చూడగా అధికారుల ఫ్యూజులు ఒక్కసారిగా ఎగిరిపోయాయి. వారికి అందులో ఓ బాలుడు కనిపించాడు. అసలు అందులో ఆ పిల్లాడు ఎందుకు ఉన్నట్లు.? అసలు ఆ స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం..
వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల ఫిలిప్పీన్స్‌లోని బరంగే కాంటాగ్నోస్ ప్రాంతాన్ని వరదలు ముంచెత్తాయి. కొండచరియలు కూడా విరిగిపడటంతో ఆ ప్రదేశమంతా అతలాకుతలం అయింది. ఇదిలా ఉంటే.. అక్కడ నివసిస్తోన్న 11 ఏళ్ల సిజే హస్మే అనే బాలుడు తన ఇంట్లో ఉండగా.. అకస్మాత్తుగా భారీ వరద నీరు ముంచెత్తడంతో.. ఏ మాత్రం భయపడని అతడు సమయస్పూర్తితో వ్యవహరించాడు. తన ఇంట్లో ఉన్న ఐస్ బాక్స్‌ను చిన్న పడవగా చేసుకుని.. అక్కడ నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. 20 గంటల పాటు నదిలో తేలిన తర్వాత రెస్క్యూ అధికారులకు హస్మే దొరికాడు.
కాగా, స్పృహలో లేని హస్మేను వెంటనే ఆసుపత్రికి తరలించారు అధికారులు.. అతడి కాలికి గాయమైందని.. ప్రాణానికి ఎలాంటి ప్రమాదం లేదని వైద్యులు చెప్పారు. ఆ తర్వాత హస్మే దగ్గర సమాచారం సేకరించగా.. కొండచరియలు విరిగినప్పుడు.. తన తల్లి, తమ్ముడు తప్పిపోయినట్లుగా చెప్పుకొచ్చాడు.