బర్గర్‌ తినడానికి బయటకు వెళ్లాడు.. లక్షాధికారిగా ఇంటికి తిరిగి వెళ్లాడు.. ఈ మధ్యలో ఏం జరిగిందబ్బా..?

|

Mar 15, 2025 | 10:29 AM

లాటరీ పేరుతో లక్షలాది మంది తమ జీవితాలను నాశనం చేసుకున్నారు. ఈ కారణంగా ప్రపంచంలోని అనేక దేశాలు, భారతదేశంలోని అనేక రాష్ట్రాలలో కూడా లాటరీని పూర్తిగా నిషేధించారు..కానీ, కొన్ని దేశాల్లో ఇప్పటికీ ఈ లాటరీలు జరుగుతునే ఉన్నాయి. ఈ క్రమంలోనే అప్పుడప్పుడు కొందరు అకస్మాత్తుగా లాటరీని గెలుచుకుని లక్షాధికారిగా మారిన కథలు కూడా చాలానే వినిపిస్తున్నాయి.. ఇక్కడ కూడా ఒక వ్యక్తి బర్గర్ తినడానికి బయటకు వెళ్లి.. తిరిగి వెళ్లేప్పుడు ఊహించని కోట్ల విలువైన లాటరీని గెలుచుకున్నాడు.

బర్గర్‌ తినడానికి బయటకు వెళ్లాడు.. లక్షాధికారిగా ఇంటికి తిరిగి వెళ్లాడు.. ఈ మధ్యలో ఏం జరిగిందబ్బా..?
Lottery Ticket
Follow us on

బ్రిటన్‌కు చెందిన ఒక వ్యక్తి బర్గర్ కొనడానికి బయటకు వెళ్లి తిరిగి వచ్చినప్పుడు, అతను ఊహించని కోట్ల విలువైన లాటరీని గెలుచుకున్నాడు. కార్న్‌వాల్‌లోని లిస్కేర్డ్‌కు చెందిన 36 ఏళ్ల క్రెయిగ్ హాగీ, బర్గర్‌ తినేందుకు బయటకు వెళ్లాడు. అక్కడ ఆర్డర్‌ కోసం వేచి చూస్తుండగానే నేషనల్ లాటరీ స్క్రాచ్‌కార్డ్‌ను కొన్నాడు. ఈ చిన్న సంఘటన తన జీవితాన్ని మారుస్తుందని అతనికి అస్సలు తెలియదు. కానీ, అలా టైమ్‌ పాస్‌ కోసం కొన్న లాటరీ టిక్కెట్‌ అతని లక్షాదికారిని చేసింది. నేషనల్ లాటరీ క్యాష్ వాల్ట్ స్క్రాచ్ కార్డ్‌లో తాను 10 లక్షల పౌండ్లు అంటే రూ. 11 కోట్ల 26 లక్షలు గెలుచుకున్నానని తెలిసిన వెంటనే, అతను నమ్మలేకపోయాడు.

స్పార్ నుండి కార్డు కొనుగోలు చేసిన నలుగురు పిల్లల తండ్రి క్రెయిగ్, తన సోదరుడు నిక్‌తో కలిసి కుటుంబానికి చెందిన WCL స్టోరేజ్ సిస్టమ్స్‌ను నడుపుతున్నాడు. దానికి అతను మేనేజింగ్ డైరెక్టర్. అయితే, అతను లాటరీ గెలుస్తాడని ఊహించలేదు. తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి దానిని కొనలేదు. కానీ గెలిచిన తర్వాత, టికెట్ పోగొట్టుకుంటానేమోనని భయంతో అతను తీవ్ర ఆందోళనకు గురయ్యాడు. అందుకే ఆ టికెట్‌ను అతడు ఎవరూ ఊహించని విధంగా భద్రంగా దాచుకున్నాడు.

ఈ మేరకు. క్రెయిగ్ మాట్లాడుతూ.. మొదట టికెట్‌ను ఒక ఫాయిల్‌లో చుట్టి, ఆపై దానిని తన శరీరంపై టేప్‌తో అతికించానని చెప్పాడు. కానీ చెమట కారణంగా అది తన శరీరంపై ఎక్కువసేపు అంటుకుని ఉండలేదని చెప్పాడు. దాంతో ఆ టికెట్‌ తీసి వంటగది క్యాబినెట్‌లో ఉంచిన సాస్పాన్‌లో ఉంచానని చెప్పాడు. తాను లక్షాధికారి అయ్యానని తెలిసి నమ్మలేకపోయాయని చెప్పాడు. క్రెయిగ్ తన భార్య జోయికి తన లాటరీ విజయాల గురించి చెప్పినప్పుడు, ఆమె భర్త తనతో జోక్ చేస్తున్నాడని అనుకుంది. కానీ, అదంతా నిజమని తెలిసి వారంతా ఒక్కసారిగా షాక్‌తిన్నారు. తమను వారించిన అదృష్టానికి వారు ఆశ్చర్యంతో పాటు ఆనందాన్ని వ్యక్తం చేశారు. గెలిచిన మొత్తాన్ని ఎలా ఉపయోగించాలో కుటుంబం ఇప్పుడు ప్లాన్ చేసుకుంటోంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..