Viral Photo: ఒక్క ఫోటోతో హృదయాలను కదిలించిన పాప.. నెట్టింట సెన్సేషన్!

ఒక్క ఫోటో జీవిత సత్యాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. ఎన్నో సమస్యలను ప్రతిబింబిస్తుంది. తాజాగా ఓ విద్యార్థిని పాఠశాలలోని..

Viral Photo: ఒక్క ఫోటోతో హృదయాలను కదిలించిన పాప.. నెట్టింట సెన్సేషన్!
Small Kid

Updated on: Apr 05, 2022 | 9:06 AM

ఒక్క ఫోటో జీవిత సత్యాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తుంది. ఎన్నో సమస్యలను ప్రతిబింబిస్తుంది. తాజాగా ఓ విద్యార్థిని పాఠశాలలోని తరగతి గదిలో కూర్చున్న ఫోటో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. మణిపూర్‌ రాష్ట్రంలో పదేళ్ల చిన్నారి పమి నాలుగో తరగతి చదువుతోంది. తన రెండేళ్ల చెల్లెల్ని ఒళ్లో కూర్చొబెట్టుకొని తరగతి గదిలో పాఠాలు వినేందుకు వచ్చింది.

బాలిక తల్లిదండ్రులు వ్యవసాయం పనుల నిమిత్తం పొద్దున్నే పొలానికి వెళ్లడంతో చెల్లెల్ని చూసుకోవాల్సిన బాధ్యతను బాలికకు అప్పగించారు. అయితే చదువుకోవాలన్న ఆసక్తి కలిగిన పమి తన చెల్లెల్ని ఒంటరిగా ఇంట్లో వదిలి వెళ్లలేక స్కూల్‌కి తీసుకుని వచ్చింది. పమి ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్ అవడంతో బాలిక గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసే వరకు తానే చదివిస్తానంటూ మణిపూర్‌ మంత్రి ముందుకొచ్చారు. బాలిక కుటుంబాన్ని గుర్తించామని, వారిని ఇంఫాల్‌ తీసుకురావాలని కోరినట్లు తెలిపారు.

ఇవి చదవండి:

Follow Us