ఇటలీలో కరోనా విలయం.. టూరిస్ట్ స్పాట్స్ నిర్మానుష్యం

ఇటలీని కరోనా వైరస్ భూకంపంలా వణికిస్తోంది. తాజాగా 463 డెత్ కేసులు నమోదు కాగా..ప్రధాని గిసెప్పీ కాంటే.. ప్రజలు ఇళ్ళు వదిలి బయటకు రావద్దని పిలుపునిచ్చారు. మిలన్ లోని టూరిస్ట్ స్పాట్ లన్నీ నిర్మానుష్యంగా మారగా రోమ్ , నేపుల్స్ తదితర నగరాల్లోని వీధుల్లో షాపులన్నీ మూతబడ్డాయి.  నేపుల్స్ లో పోలీసులు రాత్రిళ్ళు గస్తీ తిరుగుతూ.. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు బయటికి రాకూడదని లౌడ్ స్పీకర్స్ ద్వారా  హెచ్చరిస్తున్నారు. అయితే తమకు అవసరమైన సరకుల కోసం అనేక […]

  • Umakanth Rao
  • Publish Date - 6:06 pm, Tue, 10 March 20

ఇటలీని కరోనా వైరస్ భూకంపంలా వణికిస్తోంది. తాజాగా 463 డెత్ కేసులు నమోదు కాగా..ప్రధాని గిసెప్పీ కాంటే.. ప్రజలు ఇళ్ళు వదిలి బయటకు రావద్దని పిలుపునిచ్చారు. మిలన్ లోని టూరిస్ట్ స్పాట్ లన్నీ నిర్మానుష్యంగా మారగా రోమ్ , నేపుల్స్ తదితర నగరాల్లోని వీధుల్లో షాపులన్నీ మూతబడ్డాయి.  నేపుల్స్ లో పోలీసులు రాత్రిళ్ళు గస్తీ తిరుగుతూ.. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రజలు బయటికి రాకూడదని లౌడ్ స్పీకర్స్ ద్వారా  హెచ్చరిస్తున్నారు.

అయితే తమకు అవసరమైన సరకుల కోసం అనేక చోట్ల ప్రజలు సూపర్ మార్కెట్ల ముందు క్యూలు కడుతున్నారు. ఈ సూపర్ మార్కెట్లు కూడా మూసివేస్తే ఎలా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘మీ ఆరోగ్యాన్ని మీరే రక్షించుకొండి’ అని ప్రభుత్వం పదేపదే  ప్రజలను హెచ్చరిస్తోంది. కొత్తగా 9 వేల కరోనా కేసులు నమోదైనట్టు అధికారులు ప్రకటించారు.  బ్రిటన్ తదితర దేశాలు.. ఇటలీకి వెళ్లి, వచ్ఛే వందలాది విమానాలను రద్దు చేశాయి. రోమ్  సిటీలోని  వరల్డ్ లోనే పాపులర్ అయిన అనేక షాపింగ్ గ్యాలరీలు జనం లేక బోసిపోతున్నాయి. నేషన్ వైడ్ లాక్ డౌన్ ని ప్రభుత్వం ప్రకటించడంతో.. ఈ కరోనా ఇంకెంత మంది ప్రాణాలను బలి తీసుకుంటోందోనని జనాలు బెంబేలెత్తుతున్నారు.