94 ఏళ్ల తండ్రిని మొద‌టిసారి క‌లిసిన 66 ఏళ్ల కొడుకు…

ఇది ఇప్ప‌టివ‌ర‌కు ఎక్క‌డా వినన‌టువంటి, చూడ‌న‌టువంటి క‌లయిక అనే చెప్పాలి. బాల‌న్ అనే 66 ఏళ్ల వ్య‌క్తి 94 ఏళ్ల త‌న తండ్రిని మొద‌టిసారి క‌లుసుకున్నాడు. వినిడానికి ఆశ్య‌ర్యంగా ఉన్నా ఇది నిజం. ఈ స‌న్నివేశాన్ని ద‌గ్గ‌ర్నుంచి చూసినవారి మ‌న‌సు ఆనందంతో నిండిపోయింది.

  • Ram Naramaneni
  • Publish Date - 4:26 pm, Thu, 2 July 20
94 ఏళ్ల తండ్రిని మొద‌టిసారి క‌లిసిన 66 ఏళ్ల కొడుకు...

ఇది ఇప్ప‌టివ‌ర‌కు ఎక్క‌డా వినన‌టువంటి, చూడ‌న‌టువంటి క‌లయిక అనే చెప్పాలి. బాల‌న్ అనే 66 ఏళ్ల వ్య‌క్తి 94 ఏళ్ల త‌న తండ్రిని మొద‌టిసారి క‌లుసుకున్నాడు. వినిడానికి ఆశ్య‌ర్యంగా ఉన్నా ఇది నిజం. ఈ స‌న్నివేశాన్ని ద‌గ్గ‌ర్నుంచి చూసినవారి మ‌న‌సు ఆనందంతో నిండిపోయింది.

వివరాల్లోకి వెళ్తే.. కేస‌ర‌ఘ‌డ్ లో నివసిస్తున్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిటైర్డ్ చీఫ్ మేనేజర్ కరుణాక‌ర‌ణ్..మ‌ల‌ప్పురం జిల్లాలోని ఇండియానూర్ అనే గ్రామంలో తన తండ్రి కృష్ణన్ మూలాలను వెతకాలని నిర్ణయించుకున్నాడు. ఇండియానూర్‌లోని కృష్ణన్ పూర్వీకుల ఇల్లు పాడికల్ పారాంబిల్ వద్దకు వచ్చినప్పుడు, తన తండ్రికి మరొక భార్య ద్వారా బాలన్ అనే కుమారుడు ఉన్నారని తెలుసుకున్నాడు కరుణాక‌ర‌ణ్. ప‌లువుని విచారించిన పిమ్మ‌ట‌ కృష్ణన్ మొదట మరక్కర అనే మ‌హిళను వివాహం చేసుకున్న‌ట్లు, వారికి బాలన్ జ‌న్మించిన‌ట్లు నిర్దారించుకున్నాడు.

బాల‌న్ 20 రోజుల పిల్లాడిగా ఉన్న‌ప్పుడు కృష్ణన్ జాబ్ వెతుక్కోడానికి ఊరు వ‌దిలి వ‌చ్చి.. ఇక తిరిగి వెళ్ల‌లేదు. ఉపాధి వెతుకుతూ ఇండియానూర్ నుండి కృష్ణన్ ప్రయాణం అతన్ని 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాసరగోడ్కు తీసుకెళ్లింది. అత‌డికి అక్క‌డ జాబ్ దొరికింది. దీంతో అక్క‌డే నిలదొక్కుకోని..ఆ ప్రాంతానికి చెందిన మాధ‌వి అనే మ‌హిళ‌ను వివాహ‌మాడాడు. వారికి క‌రుణాక‌రున్ తో క‌లిసి నలుగురు పిల్ల‌లు క‌లిగారు. ఐదేళ్ల క్రితం కృష్ణన్ రెండో భార్య మాధ‌వి క‌న్నుమూసింది. ఈ విషయం తెలిసి త‌న‌ తండ్రి కృష్ణన్.. బాల‌న్ ను క‌ల‌వాల‌నుకుంటున్న విష‌యాన్ని అక్క‌డి గ్రామ‌స్థుల‌కు చెప్పాడు క‌రుణాక‌ర‌ణ్. వారి చొర‌వతో ఈ అరుదైన క‌ల‌యిక సాధ్య‌మైంది.