2019 రివైండ్ః ప్రేక్షకులు మెచ్చిన టాలీవుడ్ చిత్రాలు ఇవే..!

87 ఏళ్ళ తెలుగు చిత్రసీమలో ఎన్నో అద్భుతమైన సినిమాలు ఇండస్ట్రీ హిట్స్ కాగా.. మరెన్నో చిత్రాలు దారుణమైన డిజాస్టర్లుగా నిర్మాతలకు కోట్లలో లాస్ తెచ్చిపెట్టాయి. ప్రతి ఏడాది టాలీవుడ్‌లో చిన్న, పెద్ద చిత్రాలన్నీ అన్ని కలిపితే దాదాపు 200 సినిమాలకు పైగా విడుదలవుతుంటాయి. ఇక ఎప్పటిలానే ఈ 2019 సంవత్సరంలో కూడా చాలా సినిమాలు విడుదల అయ్యాయి. కొన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్లు కాగా.. మరికొన్ని ఇండస్ట్రీ హిట్స్ అయ్యాయి. మరి ఇప్పటివరకు ప్రేక్షకులు బ్రహ్మరథం […]

2019 రివైండ్ః ప్రేక్షకులు మెచ్చిన టాలీవుడ్ చిత్రాలు ఇవే..!
Follow us

|

Updated on: Dec 24, 2019 | 9:27 PM

87 ఏళ్ళ తెలుగు చిత్రసీమలో ఎన్నో అద్భుతమైన సినిమాలు ఇండస్ట్రీ హిట్స్ కాగా.. మరెన్నో చిత్రాలు దారుణమైన డిజాస్టర్లుగా నిర్మాతలకు కోట్లలో లాస్ తెచ్చిపెట్టాయి. ప్రతి ఏడాది టాలీవుడ్‌లో చిన్న, పెద్ద చిత్రాలన్నీ అన్ని కలిపితే దాదాపు 200 సినిమాలకు పైగా విడుదలవుతుంటాయి. ఇక ఎప్పటిలానే ఈ 2019 సంవత్సరంలో కూడా చాలా సినిమాలు విడుదల అయ్యాయి. కొన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్లు కాగా.. మరికొన్ని ఇండస్ట్రీ హిట్స్ అయ్యాయి. మరి ఇప్పటివరకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టిన మూవీస్ మీద మనం కూడా ఓ లుక్కేద్దాం.

ఎఫ్ 2 (ఫన్ అండ్ ఫ్రస్టేషన్)…

విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కించిన ‘ఎఫ్ 2’ 2019 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘పెటా’, ‘వినయ విధేయ రామ’ వంటి బడా చిత్రాలు ఆ తరుణంలో విడుదలైనా.. ఈ చిత్రం ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్‌గా ప్రేక్షకులను అలరించింది. అంతేకాక పండగకు ఈ మూవీ పెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

కల్కి….

యాంగ్రీ స్టార్ రాజశేఖర్ ప్రధాన పాత్రలో ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన చిత్రం ‘కల్కి’.  సస్పెన్స్ థ్రిల్లర్ నేపథ్యంతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. చాలా ఏళ్ళ తర్వాత వెండితెరపై రీ-ఎంట్రీ ఇచ్చిన రాజశేఖర్‌కు ఈ సినిమా పెద్ద హిట్ ఇవ్వడమే కాకుండా.. ఆయన కెరీర్‌కు బూస్ట్ అప్ ఇచ్చిందని చెప్పాలి. పూజిత పొన్నాడ, నందిత శ్వేతా, ఆదా శర్మ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం 2019లో బెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్స్‌లో ఒకటని చెప్పొచ్చు.

మహర్షి…

సూపర్ స్టార్ మహేష్ బాబు 25వ చిత్రంగా తెరకెక్కింది ‘మహర్షి’. మహేష్ కెరీర్‌లోనే ఇదొక మైల్‌స్టోన్ అని చెప్పొచ్చు. యాక్షన్, మెసేజ్, ఎమోషన్స్ ఒకటేమిటి ఇలా అన్ని కూడా ఈ మూవీలో సమపాళ్ళులో ఉన్నాయి. ఈ ఏడాది బెస్ట్ మూవీస్‌లో ఒకటిగా నిలిచిన ‘మహర్షి’ మహేష్‌కు మెమరబుల్ మూవీగా మిగిలిపోయింది.

మజిలీ…

అక్కినేని నాగచైతన్య, సమంతా జంటగా నటించిన చిత్రం ‘మజిలీ’. దివ్యన్ష కౌషిక్, రావు రమేష్, పోసాని కృష్ణ మురళి, సుబ్బరాజు తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమాకు శివ నిర్వాణ దర్శకుడు. కుటుంబ కథలను రూపొందించడంలో శివ దిట్ట. అతడి గత చిత్రం ‘నిన్ను కోరి’ మాదిరిగానే ఈ మూవీకు కూడా ప్రేక్షకులు నుంచి విశేషదారణ లభించింది.

చిత్రలహరి…

సాయిధరమ్ తేజ్, కళ్యాణి ప్రయదర్శన్, నివేథా పేతురాజ్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు కిషోర్ తిరుమల తెరకెక్కించిన చిత్రం ‘చిత్రలహరి’. మంచి సోషల్ మెసేజ్‌తో అద్భుతమైన డైలుగులతో కూడిన ఈ మూవీ యువతను ఆకట్టుకుంది. 2019లో వన్ అఫ్ ది బెస్ట్ మూవీ అని చెప్పాలి.

ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ…

నవీన్ పోలిశెట్టి హీరోగా వచ్చిన చిత్రం ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’. డిటెక్టీవ్, మర్డర్ మిస్టరీ కథాంశంతో రూపొందిన ఈ చిత్రానికి ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. 2019లో చిన్న సినిమాగా వచ్చి బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద బ్లాక్‌బస్టర్‌గా మారింది.

బ్రోచేవారెవరురా…

క్రైమ్ కామెడీ జోనర్‌లో తెరకెక్కిన చిత్రం ‘బ్రోచేవారెవరురా’. ఈ చిత్రంలో శ్రీ విష్ణు, నివేద థామస్,  నివేథా పేతురాజ్, సత్య దేవ్, రాహుల్ రామకృష్ణ, శివాజి రాజా, ప్రియదర్శిని ప్రధాన పాత్రలు పోషించారు. వివేక్ ఆత్రేయ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.

జెర్సీ…

నేచురల్ స్టార్ నాని, ‘మళ్ళీ రావా’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం ‘జెర్సీ ‘. ఈ ఏడాది విడుదలైన చిత్రాల్లో ఇది ‘వన్ అఫ్ ది బెస్ట్’ ఫిల్మ్‌గా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ‘అర్జున్’ పాత్రలోకి నాని పరకాయ ప్రవేశం చేసి మరీ జీవించాడని.. ఫ్యాన్స్ ప్రశంసలు కురిపించారు. వరుస ఫెయిల్యూర్స్‌తో సతమతమవుతున్న నానికి ఈ సినిమా మంచి విజయాన్ని అందించడమే కాకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ వసూళ్లు రాబట్టింది.

ఇస్మార్ట్ శంకర్…

‘ఇస్మార్ట్ శంకర్’.. ఈ సినిమా విడుదల కాకముందు దర్శకుడు పూరి జగన్నాధ్, హీరో రామ్ పోతినేని వరుస ప్లాప్స్‌తో సతమతమయ్యారు. అయితే ఈ మూవీ రిలీజైన మొదటి షో నుంచే హిట్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా ఇద్దరి కెరీర్లకు మంచి కిక్కు ఇచ్చింది. పక్కా మాస్ మసాలా ఎంటర్టైనర్‌గా 2019లో ది బెస్ట్‌గా నిలిచింది.

ఓ బేబి….

‘మిస్ గ్రానీ’కి రీమేక్‌గా తెరకెక్కిన ‘ఓ బేబి’ చిత్రంలో సమంత అక్కినేని, లక్ష్మి, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్‌లు కీలక పాత్రలు పోషించారు. దర్శకురాలు నందిని రెడ్డి రూపొందించిన ఈ మూవీ క్రిటిక్స్ నుంచి ప్రశంసలు అందుకోవడమే కాకుండా సమంతా నటనకు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.

రాక్షసుడు…

తమిళ హిట్ మూవీ ‘రత్ససన్’కు తెలుగు రీమేక్‌గా తెరకెక్కిన ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలు పోషించారు. మాతృకకు ఏ మాత్రం తీసిపోకుండా.. గ్రిప్పింగ్ స్క్రీన్‌ప్లేతో దర్శకుడు రమేష్ వర్మ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు. వరుస ఫెయిల్యూర్స్‌లో ఉన్న హీరో, హీరోయిన్, దర్శకుడికి ఈ చిత్రం బిగ్ బూస్ట్ ఇవ్వడమే కాకుండా బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది.

గద్దలకొండ గణేష్…

తమిళ కల్ట్ మూవీ ‘జిగర్ తండా’ ఆధారంగా ‘గద్దలకొండ గణేష్’ తీశారు. పూర్తి నెగటివ్ క్యారెక్టర్‌లో నటించిన వరుణ్ తేజ్.. ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచాడు. గ్యాంగ్‌స్టర్‌ రోల్‌లో జీవించాడని చెప్పాలి. అథర్వ మురళీ, మృణాళిని రవి, పూజా హెగ్డేలు కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు హరీష్ శంకర్ దర్శకుడు. పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్‌తో తెరకెక్కిన ఈ చిత్రం పెద్ద హిట్ సాధించింది.

సైరా నరసింహా రెడ్డి…

తొలి స్వాతంత్ర్య సమరయోదుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథతో రూపొందిన చిత్రం ‘సైరా నరసింహరెడ్డి’. ఇందులో మెగాస్టార్ చిరంజీవి, నయనతార, అమితాబ్ బచ్చాన్, సుదీప్, జగపతి బాబు, విజయ్ సేతుపతి తదితరులు ముఖ్యపాత్రలలో నటించారు. ఈ సినిమాకి దర్శకత్వం సురేంద్ర రెడ్డి వహించారు,  కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ బ్యానర్‌లో హీరో రామ్ చ‌ర‌ణ్ ఈ చిత్రాన్ని నిర్మించారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం ఎంతటి బ్లాక్‌బస్టర్ విజయాన్ని సాధించిందో అందరికి తెలిసిందే.

జార్జ్ రెడ్డి…

‘జార్జ్ రెడ్డి’… ఇండియన్ చేగువేరా అని చెప్పాలి. ధైర్యం, సాహసానికి ప్రతీకగా ఈ పేరు నిలుస్తుంది. 1967లో ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి ఉద్యమాలకు బీజం వేసిన జార్జ్ రెడ్డి అనే విద్యార్థి నాయకుడి జీవిత కథ ఆధారంగా జార్జ్ రెడ్డి సినిమాను తెరకెక్కించారు. యూనివర్సిటీలో చదువుతూ ఎన్నో విద్యార్థి ఉద్యమాలకు తిరుగులేని నాయకుడిగా ఎదిగిన జార్జ్ రెడ్డిని చిన్న వయసులోనే కొందరు ప్రత్యర్ధులు క్యాంపస్‌లోనే హత్య చేశారు. 1965-75 మధ్య ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న ప్రతీ విద్యార్థికి జార్జ్ జీవితం గురించి తెలుసు. అలాంటి టెరిఫిక్ లీడర్ జీవితకథను ఈ తరానికి తెలిసే విధంగా ఈ మూవీను రూపొందించారు. కలెక్షన్స్ పరంగా నిరాశపరిచినా.. ఈ సినిమాను విమర్శకులు, ప్రేక్షకులు మంచి సినిమాగా పట్టం కట్టారని చెప్పాలి.

ఏపీలో పింఛన్లు తీసుకునేవారికి శుభవార్త..
ఏపీలో పింఛన్లు తీసుకునేవారికి శుభవార్త..
టీ20 ప్రపంచకప్‌ 2024లో భారత సిక్సర్ కింగ్ రీఎంట్రీ.. ఎందుకంటే?
టీ20 ప్రపంచకప్‌ 2024లో భారత సిక్సర్ కింగ్ రీఎంట్రీ.. ఎందుకంటే?
పార్లమెంటు స్థానాల్లో ఇద్దరూ మంత్రుల మధ్య పోటీ..?
పార్లమెంటు స్థానాల్లో ఇద్దరూ మంత్రుల మధ్య పోటీ..?
మహేష్ బాబు పక్కన ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు ఓ స్టార్ హీరో భార్య..
మహేష్ బాబు పక్కన ఉన్న ఈ చిన్నారి ఇప్పుడు ఓ స్టార్ హీరో భార్య..
వావ్‌ వాటే టెక్నాలజీ.. కేసీఆర్‌ బస్సులో లిఫ్ట్‌, గమనించారా.?
వావ్‌ వాటే టెక్నాలజీ.. కేసీఆర్‌ బస్సులో లిఫ్ట్‌, గమనించారా.?
అసలు, నకిలీ బాదం మధ్య తేడా గుర్తించడానికి సింపుల్ టిప్స్ మీ కోసం
అసలు, నకిలీ బాదం మధ్య తేడా గుర్తించడానికి సింపుల్ టిప్స్ మీ కోసం
కిలోమీటర్‌కు 25 పైసల ఖర్చుతో సూపర్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌
కిలోమీటర్‌కు 25 పైసల ఖర్చుతో సూపర్‌ ఎలక్ట్రిక్‌ బైక్‌
ప్లేఆఫ్స్ చేరాలంటే గెలవాల్సిందే.. ఢిల్లీ vs ముంబై కీలక పోరు..
ప్లేఆఫ్స్ చేరాలంటే గెలవాల్సిందే.. ఢిల్లీ vs ముంబై కీలక పోరు..
మానవత్వం చాటుకున్న మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్
మానవత్వం చాటుకున్న మాజీ ఎంపీ డాక్టర్ బూర నర్సయ్య గౌడ్
హెల్మెట్ లేకుండా స్కూటర్ నడుపుతూ మొబైల్ ఫోన్ పేలడంతో మహిళ మృతి
హెల్మెట్ లేకుండా స్కూటర్ నడుపుతూ మొబైల్ ఫోన్ పేలడంతో మహిళ మృతి
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
మీ మొబైల్‌కు వచ్చే ఫేక్‌ మెసేజ్‌లను ఎలా గుర్తించాలి ?
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో