Electric Vehicles Expo: వీల్ చైర్ నుంచి బస్సుల వరకు.. ఔరా అనిపించిన ఈ వెహికల్స్ ఎక్స్‌పో..

|

Feb 10, 2023 | 8:48 PM

హైటెక్స్ వేదికగా నిర్వహించిన ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎక్స్‌పో ఔరా అనిపించింది. బ్యాటరీలతో నడిచే ఎలక్ట్రిక్ వాహనాలు ఆకట్టుకుంటున్నాయి. వీల్ చైర్ నుంచి బస్సుల వరకు అన్ని రకాల ఎలక్ట్రిక్ వాహనాలను ఇక్కడ ప్రదర్శించారు. అంతే కాదు ఎలక్ట్రిక్‌ వాహనాలకు అవసరమయ్యే యాక్సెసరీస్‌ కూడా ఇక్కడ అందుబాటులో ఉంచారు.

Electric Vehicles Expo: వీల్ చైర్ నుంచి బస్సుల వరకు.. ఔరా అనిపించిన ఈ వెహికల్స్ ఎక్స్‌పో..
Electric Vehicles Expo
Follow us on

పర్యావరణహిత వాహనాలను ప్రోత్సాహించేందుకు E- మొబిలిటీ వీక్ పేరుతో తెలంగాణ ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా హైదరాబాద్‌ హైటెక్స్‌లో ఎలక్ట్రిక్ మోటార్ షో పేరుతో ఎగ్జిబిషన్ నిర్వహించారు. అనేక కంపెనీలు ఈ షోలో తమ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రదర్శనకు ఉంచాయి. టూ-వీలర్, త్రీ-వీలర్, ఫోర్-వీలర్‌తోపాటు వీల్ చైర్‌ కార్ట్స్‌, బ్యాటరీలు చార్జింగ్ స్టేషన్స్‌ వంటి ప్రొడక్ట్స్ కూడా ఈ ఎగ్జిబిషన్‌లోకనిపించాయి.

ఈ ప్రదర్శనలో ఉంచిన ఎలక్ట్రిక్‌ సైకిళ్ల ధర 25 వేల రూపాయల నుంచి లక్ష వరకు ఉంది. బైకుల స్టార్టింగ్‌ ప్రైసే లక్షా 40 వేలు. వీటిలో రేంజ్‌ను బట్టి 3 లక్షల రూపాయల వరకుంది. 7 లక్షల రూపాయల నుంచి 20 లక్షల ఖరీదు చేసేవరకు వరకు ఉన్నాయి కార్లు.

నాలుగు గంటలు ఛార్జ్‌ చేస్తే 80 నుంచి 150 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు ఈ ఎలక్ట్రిక్‌ బైకులతో. అదే కార్లలో అయితే 8 గంటల చార్జింగ్‌తో 200 కిలోమీటర్ల దూరం ప్రయాణించగలిగే కెపాసిటీతో కూడిన బ్యాటరీలు ఉన్నాయి. స్పీడును బట్టి బ్యాటరీ ఎంత దూరం వస్తుందన్నది ఆధారపడి ఉంటుందని నిర్వాహకులు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

ఈ ఎగ్జిబిషన్‌లో దేశీయ కంపెనీలతో పాటు విదేశీ కంపెనీలు కూడా పాల్గొన్నాయి. పుడ్ పాయింట్‌లా ఉండే వాహనాలు, వీల్ చైర్‌కి అటాచ్ చేసే బైక్, ఎలక్ట్రిక్ రైడ్ స్కేటింగ్, ఒలా బైక్‌లు స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాయి.

హైదరాబాద్‌లో మొట్టమొదటిసారి నిర్వహిస్తున్న ఫార్మూలా E-రేసుకు అనుబంధంగా ఏర్పాటు చేసిన ఈ ఎక్స్‌పోలో ఫార్ములా రేస్ కార్ డ్రైవ్‌ చేస్తే ఎలా ఉంటుందో ఆ ఫీల్‌ అందించేందుకు వర్చువల్ రైడ్‌ కూడా ఏర్పాటు చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం