సెల్ఫీ వీడియో తీసుకుంటూ గృహిణి ఆత్మహత్య.. చివరి క్షణంలో చూసిన పిల్లలు.. హైదరాబాద్‏లో విషాదం..

హైదరాబాద్‏లోని లాలాపేటలో విషాదం చోటు చేసుకుంది. కాగా ఆదివారం మంజుల సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

సెల్ఫీ వీడియో తీసుకుంటూ గృహిణి ఆత్మహత్య.. చివరి క్షణంలో చూసిన పిల్లలు.. హైదరాబాద్‏లో విషాదం..
Sucide
Follow us
Rajitha Chanti

|

Updated on: Dec 06, 2020 | 5:03 PM

Hyderabad: హైదరాబాద్‏లోని లాలాపేటలో విషాదం చోటు చేసుకుంది. లాలాపేటలో నివసిస్తున్న మంజులకు 12 సంవత్సరాల క్రితం వివాహమైంది. ఈమె భర్త స్థానికంగా అయ్యంగార్ బేకరి నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. వీరికి రంజిత్, తేజస్ ఇద్దరు కుమారులు ఉన్నాయి. కాగా ఆదివారం మంజుల సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. దీనిని చివరి క్షణంలో చూసిన పిల్లలు తల్లిని కాపాడే ప్రయత్నం చేశారు.

అదే సమయంలో బయట ఉన్న తండ్రికి పిల్లలు ఫోన్ చేసి విషయం చెప్పారు. దీంతో అతడు వచ్చేలోపే మంజుల మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనస్థలానికి చేరుకున్నారు. మంజుల మృతికి గల కారణాలపై వివరాలను సేకరిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కాగా మంజుల తీసిన సెల్ఫీ వీడియో రికార్డు అయ్యిందా? ఒకవేళ రికార్డు అయితే అందులో ఏం చెప్పిందనే విషయం తెలియాల్సి ఉంది.