ప్రెగ్నెంట్ అంటూ వివాహిత అబద్ధం.. 9 నెలలు నిండాక ఆస్పత్రిలో చేర్పించడంతో బాత్రూంలో…

|

Sep 12, 2024 | 7:54 AM

గర్భం దాల్చానని చెప్పి 6 నెలలుగా పుట్టింట్లో ఉంటూ అందరినీ నమ్మించింది. చివరికి ప్రసవం కోసం ఆస్పత్రిలో చేర్పించడంతో అసలు విషయం బయటపడింది. జనగామ మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో చోటు చేసుకున్న ఈ ఘటన తాలూకా వివరాలు తెలుసుకుందాం పదండి...

ప్రెగ్నెంట్ అంటూ వివాహిత అబద్ధం.. 9 నెలలు నిండాక ఆస్పత్రిలో చేర్పించడంతో బాత్రూంలో...
Fake Pregnancy
Follow us on

పెళ్లయ్యి రెండేళ్లు అవుతుంది.  పిల్లలు కలగడం లేదన్న అత్తింటివారి సూటి పోటీ మాటలతో ఆమెకు ఏం చేయాలో పాలు పోలేదు. ఒత్తిడి తట్టుకోలేక ప్రెగ్నెంట్ అయినట్లు అబద్ధం చెప్పింది. ఆ తర్వాత 9 నెలల వరకు టవల్స్‌ చుట్టుకొని అటు అత్తింటివారిని, పుట్టింటి వారిని మేనేజ్ చేసింది. చివరికి నెలలు నిండటంతో.. హాస్పిటల్‌లో చేర్పించారు. ఆ తర్వాత ఊహించని ట్విస్ట్ చేసుకుంది. జనగామ జిల్లా కేంద్రంలోని మాతా శిశు కేంద్రం ఆసుపత్రికి చోటు చేసుకున్న ఈ ఘటన ఆస్పత్రి వర్గాలను కంగారు పెట్టించింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జనగామ జిల్లా పాలకుర్తి మండలం మొండ్రాయి తండాకు చెందిన ఓ గిరిజన మహిళ.. 6 నెలల కిందట తాను గర్భం దాల్చినట్లు ఇంట్లో వాళ్లకి చెప్పింది. ఆ తర్వాత అమ్మగారింటికి వెళ్లిపోయింది. ప్రెగ్నెన్సీ వచ్చినట్లు నెలల పాటు భర్తతో పాటు ఇరు కుటుంబాల వారిని నమ్మిస్తూ వచ్చింది ఆ మహిళ. పొట్ట లేకపోవడంతో ఇరుగు పొరుగువారికి డౌట్ ఉంది. అయినప్పటికీ మేనేజ్ చేస్తూ వచ్చింది. చివరికి డెలివరీ డేట్ రానే వచ్చింది. సెప్టెంబర్ 11 ఉదయం నొప్పులు వస్తున్నాయంటూ ఇంట్లో వాళ్లకు చెప్పింది. దీంతో ఆమెను జనగామ మాతా శిశు హాస్పిటల్‌లో జాయిన్ చేశారు.

కుటుంబ సభ్యులు డాక్టర్లతో మాట్లాడుతూ ఉండగా.. టాయిలెట్‌కు వెళ్లొస్తా అంటూ వార్డు నుంచి వెళ్లిపోయింది సదరు వివాహిత. చాలా సమయం తర్వాత బయటకు వచ్చింది. బంధువులు ఆందోళన చెందుతుండగా.. బాత్రూమ్ నుంచి బయటకు వచ్చిన ఆ మహిళ.. తనకు వాష్‌రూమ్‌లో డెలివరీ అయిందని, శిశువు డ్రైనేజీలో పడిపోయిందని చెప్పింది. దీంతో వెంటనే అలర్టైన ఆస్పత్రి సిబ్బంది.. ఆ ప్రాంతం అంతా వెతికినా అలాంటి ఆనవాళ్లు కనిపించలేదు. దీంతో డౌట్ వచ్చి.. ఆమెకు టెస్టులు చేశారు డాక్టర్లు. రిపోర్ట్స్‌లో ఆమె అసలు గర్భమే దాల్చినట్లు తేలింది. దీంతో ఆస్పత్రి వర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేశాయి.

సదరు మహిళను స్టేషన్‌కు తరలించి ప్రశ్నించగా… తాను గర్భం దాల్చలేదని..  అత్తింటి వారి నుంచి వచ్చిన ఒత్తిడిని తట్టుకోలేక అలా నాటకం ఆడినట్లు ఆ వివాహిత అంగీకరించింది. పోలీసులు ఆమెతో పాటు కుటుంబ సభ్యులకు కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.