AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Elephant: ఏనుగులు పగబడతాయని మీకు తెల్సా.? ఒక్కసారి వాటి జోలికెళ్తే.. చచ్చేదాకా మర్చిపోవ్

అడవికి రాజైన ఏనుగు, చిన్న తూనీగ లేదా ఇతర కీటకాలకు ఎందుకు భయపడుతుందో మీకు తెలుసా? అవి చెవులలోకి ప్రవేశించి ఇబ్బంది పెడతాయనే భయంతోనే ఏనుగులు వాటి చెవులను విసనకర్రలా ఊపుతాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. ఓ సారి చెక్ చేయండి.

Elephant: ఏనుగులు పగబడతాయని మీకు తెల్సా.? ఒక్కసారి వాటి జోలికెళ్తే.. చచ్చేదాకా మర్చిపోవ్
Elephant
Ravi Kiran
|

Updated on: Mar 24, 2026 | 7:07 PM

Share

ప్రకృతిలో అనేక అద్భుత జీవులు ఉన్నాయి. వాటిలో ఏనుగులు ప్రత్యేక స్థానాన్ని కలిగి ఉన్నాయి. ఈ భారీ జంతువుల గురించి మీకు తెలియని అనేక ఆసక్తికరమైన నిజాలు ఉన్నాయి. ఏనుగులు పగ పట్టగలవు. తమకు హాని చేసిన వారిని అవి సులభంగా మర్చిపోవు. చాలాకాలం పాటు ఆ సంఘటనను గుర్తుంచుకుంటాయి. ఏనుగులు అపారమైన బరువును కలిగి ఉంటాయి. కొన్ని ఏనుగులు 7,000 కిలోల వరకు పెరగగలవు. వాటి తొండం అద్భుతమైనది. ఏనుగు తొండంలో దాదాపు 40,000 కండరాలు ఉంటాయి. ఈ అసాధారణ బలంతో, అవి చిన్న వస్తువుల నుంచి భారీ వాహనాల వరకు సులువుగా ఎత్తగలవు. ఏనుగులు ఎంతో భావోద్వేగ జీవులు. సాటి ఏనుగు చనిపోతే అవి ఏడుస్తాయి, దాని మృతదేహం వద్ద చాలా సమయం గడుపుతాయి. ఏనుగులకు అద్భుతమైన జ్ఞాపకశక్తి ఉంటుంది. పదేళ్ల తర్వాత కూడా అవి వ్యక్తుల ముఖాలను గుర్తుపట్టగలవు. తమకు హాని చేసిన వారిని అవి అస్సలు మర్చిపోవు. ఇది వాటి తెలివితేటలకు, జ్ఞాపకశక్తికి నిదర్శనం.

మరిన్ని ఆసక్తికర విషయాలు..

  1. ఏనుగులు రోజులో కేవలం రెండు నుంచి మూడు గంటలు మాత్రమే నిద్రపోతాయి.
  2. ఒక ఏనుగు రోజుకు దాదాపు 160 లీటర్ల నీటిని తాగి, 300 కిలోల ఆహారాన్ని తింటుంది.
  3. ఏనుగు తన తొండంలో దాదాపు 8 లీటర్ల నీటిని నిల్వ చేసుకోగలదు.
  4. ఏనుగులకు ఒక ప్రత్యేక సామర్థ్యం ఉంది. అవి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న నీటిని కూడా సులభంగా గుర్తించగలవు.
  5. ఇంతటి గొప్ప లక్షణాలున్న ఏనుగులు చిన్న కీటకాలకు భయపడటం కేవలం వాటి చెవులను రక్షించుకోవడానికే అని స్పష్టమవుతుంది.

ఇది చదవండి: ట్రాఫిక్‌ చలాన్లు ఎగ్గొడుతున్నారా.. 5 కంటే ఎక్కువ ఉంటే మీకో షాకింగ్‌ న్యూస్‌.!

Follow Us