
ఓ ప్రముఖ కంపెనీ ఎండీ పేరుతో వాట్సాప్ అకౌంట్ క్రియేట్ చేసి.. అతని ప్రొఫైట్ ఫోటో ద్వారా ఏకంగా రూ.4.70 కోట్లు కాజేసిన కేటుగాళ్లు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ పోలీసులు పట్టుకున్నారు. నిందితులు దోసపాటి కృష్ణసాయి, మండవల్లి శివ నాగరాజుగా గుర్తించారు. వీరు సైబర్ మోసగాళ్లకు బ్యాంకు ఖాతాలు సమకూర్చి కమిషన్‌గా సుమారు 4 లక్షలు పొందినట్లు దర్యాప్తులో తేలింది. వీరికి మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడులో నమోదైన పలు సైబర్ నేరాలతో ఖాతాకు సంబంధాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
పోలీసుల కథనం ప్రకారం.. ఒక ప్రముఖ కంపెనీ ఎండీ ఫోటో, పేరుతో ఉన్న వాట్సాప్ నంబర్ నుంచి సదురు కంపెనీలో పనిచేస్తున్న ఓ ఎంప్లాయ్‌కు కొన్ని మెసేజ్‌లు వచ్చాయి. అవి నిజంగానే తన బాస్ పంపినవని నమ్మిన బాధితుడు, సదరు నంబర్ నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారం వివిధ బ్యాంక్ ఖాతాలకు విడతలవారీగా మొత్తం రూ.4.70 కోట్లు బదిలీ చేశాడు. కట్‌చేస్తే.. అది తన బాస్ కాదని తెలియడంతో మోసపోయామని గ్రహించిన బాధితులు సైబర్ క్రైమ్‌లో ఫిర్యాదు చేయడంతో ఘటనపై కేసు నమోదు చేసుకన్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
ఈ కేసులో సాంకేతిక విశ్లేషణ, బ్యాంక్ ఖాతాల పరిశోధన ఆధారంగా పోలీసులు ఇద్దరు నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. నిందితులను ఖమ్మం జిల్లా సత్తుపల్లికి చెందిన దోసపాటి కృష్ణసాయి, హైదరాబాద్ కొత్తపేటలో నివసిస్తున్న మండవల్లి శివ నాగరాజుగా గుర్తించారు. వీరు సైబర్ నేరగాళ్లకు కమిషన్ల ఆశ చూపి కరెంట్ బ్యాంక్ ఖాతాలను సరఫరా చేస్తున్నట్లు విచారణలో తేలింది. ఇలా చేసేందుకు వీరు రూ.4లక్షల కమిషన్ తీసుకున్నట్టు పోలీసులు తెలిపారు.
సైబర్ నేరాల పోలీసులు సూచనలు
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి