చలి పెరుగుతోంది. ఇన్నాళ్లు సాధారణంగా ఉన్న ఉష్ణోగ్రతలు.. నిన్నటి నుంచి పడిపోతున్నాయి. కనిష్ఠ స్థాయికి చేరుకుని ప్రజలను వణికిస్తున్నాయి. నార్త్ ఇండియాలో వీస్తున్న చలి గాలుల కారణంగా ఈ పరిస్థితి ఏర్పడిందని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు. దీంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చలి తీవ్రత విపరీతంగా పెరిగిపోతోంది. అంతే కాకుండా అక్కడక్కడ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. బంగాళాఖాతంలో దక్షిణ భాగాల్లో కూడా చల్లటి వాతావరణ ఉంది. అక్కడక్కడ వర్షాలు కూడా పడతాయి. రానున్న రోజులు ముఖ్యంగా 11వ తేదీ వరకు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ, ఆంధ్రప్రదేశ్ వెదర్ అధికారులు సూచిస్తున్నారు. చాలా ప్రాంతాల్లో పది డిగ్రీలు అంతకంటే తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి. ఉత్తర, తూర్పు తెలంగాణ, ఉత్తరాంధ్రలో చలి తీవ్ర ఎక్కువగా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో దాదాపు సున్నా డిగ్రీలకు ఉష్ణోగ్రతలు నమోదుకు అవకాశం ఉంది.
ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, కొమ్రంభీం, భద్రాద్రి జిల్లాలో తీవ్రత అధికంగా ఉంది. రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, మహబూబ్‌నగర్, హైదరాబాద్, హైదరాబాద్ పరిసరాలు, నాగర్ కర్నూలు, వరంగల్ ఉమ్మడి జిల్లాలో చలి తీవ్రత అధికంగా ఉంది. ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో దాదాపు సున్నా డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు వార్నింగ్ ఇస్తున్నారు.
మరోవైపు.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చలి తీవ్రత కారణంగా అక్కడక్కడ వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. రాయసీమలోని దక్షిణ భాగంలో కూడా మేఘావృతమై ఉంటుంది. బంగాళాఖాతంలో దక్షిణ భాగాల్లో కూడా చల్లటి వాతావరణ ఉంది. అక్కడక్కడ వర్షాలు కూడా పడొచ్చని వాతావరణ శాఖ పేర్కొంది. హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయాయి. మరో నాలుగు రోజులపాటు ఉష్ణోగ్రతలు మరింత పడిపోతాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు ఇప్పటికే ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం..