Telangana: తడిసిన ప్రతి గింజనూ కొంటాం.. తెలంగాణ రైతన్నలకు సీఎం కేసీఆర్‌ భరోసా..

|

May 02, 2023 | 9:56 PM

తెలుగు రాష్ట్రాల్లో అన్నదాతల కష్టాలు కొనసాగుతున్నాయ్‌. అకాల వర్షాలతో పంటను కోల్పోయి గుండెలు పగిలేలా ఏడుస్తున్నాడు రైతన్న. ఏపీ, తెలంగాణలో ఏ రైతును కదిపినా ఇదే పరిస్థితి. ఇప్పటికే నిండా మునిగిన రైతన్నలను మరోసారి భయపెడుతున్నాడు వరుణుడు.

Telangana: తడిసిన ప్రతి గింజనూ కొంటాం.. తెలంగాణ రైతన్నలకు సీఎం కేసీఆర్‌ భరోసా..
Telangana CM KCR
Follow us on

తెలుగు రాష్ట్రాల్లో అన్నదాతల కష్టాలు కొనసాగుతున్నాయ్‌. అకాల వర్షాలతో పంటను కోల్పోయి గుండెలు పగిలేలా ఏడుస్తున్నాడు రైతన్న. ఏపీ, తెలంగాణలో ఏ రైతును కదిపినా ఇదే పరిస్థితి. ఇప్పటికే నిండా మునిగిన రైతన్నలను మరోసారి భయపెడుతున్నాడు వరుణుడు. మరో ఐదురోజులు భారీ వర్షాలు తప్పవన్న హెచ్చరికలు అన్నదాతలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.

కన్నబిడ్డలకు చిన్న ముల్లు గుచ్చుకుంటేనే తట్టుకోలేం! అదే నవమాసాలు మోసి పెంచిన బిడ్డను కోల్పోతే అది ఎంత నరకమో!. ఆ బాధ ఎలాగుంటుందో అనుభవించినవాళ్లకే తెలుస్తుంది!. తెలుగు రాష్ట్రాల్లోని అన్నదాతలు ఇప్పుడు అలాంటి అంతులేని ఆవేదనతో గుండెలు బాదుకుంటున్నారు. పొలం దున్ని, నారుమడి వేసి, పంట పండించి, కుప్ప కూర్చితే.. గద్దొచ్చి బిడ్డను ఎత్తుకుపోయినట్టుగా అకాల వర్షాలొచ్చి పంట మొత్తం నీటిపాలవడంతో… రైతన్నలు గుండెలు పగిలేలా ఏడుస్తున్నారు. ఏపీ, తెలంగాణలో ఎక్కడ చూసినా అన్నదాతల ఆక్రందనలే వినిపిస్తున్నాయ్‌.

తెలంగాణలో పంట నష్టం, రైతన్నల ఆవేదనపై ఆరా తీశారు సీఎం కేసీఆర్‌. మంత్రులు హరీష్‌రావు, జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌తోపాటు రైతుబంధు సమితి అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి నుంచి వివరాలు తీసుకున్నారు. ధాన్యం సేకరణ, పంట నష్టం నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అన్నదాతలను ఆదుకోవడంపై చర్చించారు.

ఇవి కూడా చదవండి

మరోవైపు, జిల్లాల్లో పర్యటిస్తూ దెబ్బతిన్న పంటలు, నీటిపాలైన ధాన్యాన్ని పరిశీలిస్తున్నారు మంత్రులు, ఎమ్మెల్యేలు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం సీతారాంపురంలో కొనుగోలు కేంద్రానికి వెళ్లిన మంత్రి ఎర్రబెల్లి… రైతుల్లో భరోసా నింపారు. తేమ పేరుతో రైతులను ఇబ్బంది పెట్టకుండా ధాన్యాన్ని కొనుగోలు చేయాలని అధికారులను ఆదేశించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..