Telangana: పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో అపశృతి… వంట వండుదామని కట్టెల పొయ్యి వెలిగించడంతో…

|

Apr 12, 2021 | 9:17 PM

వరంగల్ అర్బన్ జిల్లా ఖిలావరంగల్‌ మండలం మామునూరులో విషాదం చేటు చేసుకుంది. పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో అకస్మాత్తుగా తేనె టీగలు దాడి చేయడంతో...

Telangana: పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో అపశృతి... వంట వండుదామని కట్టెల పొయ్యి వెలిగించడంతో...
Honey Bees Attack
Follow us on

వరంగల్ అర్బన్ జిల్లా ఖిలావరంగల్‌ మండలం మామునూరులో విషాదం చేటు చేసుకుంది. పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో అకస్మాత్తుగా తేనె టీగలు దాడి చేయడంతో పూర్వ విద్యార్థి ఒకరు మృత్యువాతపడ్డారు. ఈ ఘటనతో స్థానికంగా అందరినీ కంటతడి పెట్టించింది.

మామునూరు ZPPSలో 2001 బ్యాచ్ కు చెందిన పదవ తరగతి పూర్వ విద్యార్థుల గెట్‌ టూ గేదర్‌ ఏర్పాటు చేసుకున్నారు. ఆ బ్యాచ్‌కు చెందిన 60 మంది విద్యార్థులు, అప్పటి ఉపాధ్యాయులు కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ క్రమంలో భోజనాలు వండేందుకని కట్టెల పొయ్యి వెలిగించగా ఆ పొగకు సమీపంలోని చెట్టుపై ఉన్న తేనెటీగలు వారిపై దాడి చేశాయి. తేనెటీగల దాడిలో ఖిలా వరంగల్‌ పడమరకోటకు చెందిన భాస్కర్‌కు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే అతన్ని వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గ మధ్యలో మృతి చెందారు.

మిగతా విద్యార్థులు బెటాలియన్‌ యూనిట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. భాస్కర్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎంకి తరలించారు. కాగా పూర్వ విద్యార్థులు అందరూ కలిసి.. మధుర జ్ఞాపకాలు మనసులో పదిలంగా ఉంచుకుందా అనుకుంటే.. ఈ దురదృష్టకర ఘటన జరగడం స్థానికులను సైతం కంటతడి పెట్టించింది.

Also Read: పెరట్లో పేడ దిబ్బ తొలగిస్తుంటే… చేతికి అస్థిపంజరం తగిలింది.. ఆరా తీయగా షాకింగ్ ట్విస్ట్

చూడ చక్కని రూపాలు ఇప్పుడు ఫోటోలకే పరిమితం.. అక్కా తమ్ముడ్ని మింగేసిన లారీ.. ఆ తల్లి బాధ వర్ణణాతీతం