Warangal: టెస్కో గోదాంలో భారీ అగ్ని ప్రమాదం.. కాలి బూడిదైన రూ.40 కోట్ల ఆస్తి..!

Fire Breaks in Tesco Godowns: ఒక్క అగ్నిప్రమాదం 40 కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చింది.. ఫైర్‌ సిబ్బంది వచ్చేలోపే కాలిబూడిదగా మారింది. అయితే ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

Warangal: టెస్కో గోదాంలో భారీ అగ్ని ప్రమాదం.. కాలి బూడిదైన రూ.40 కోట్ల ఆస్తి..!
fire

Updated on: Apr 12, 2022 | 7:18 AM

Fire Breaks in Tesco Godowns: ఒక్క అగ్నిప్రమాదం 40 కోట్ల రూపాయల నష్టాన్ని మిగిల్చింది.. ఫైర్‌ సిబ్బంది వచ్చేలోపే కాలిబూడిదగా మారింది. అయితే ప్రాణనష్టం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. చూస్తుండగానే మంటలు ఎగిసిపడ్డాయి. కొన్ని గంటల వరకు మంటలు అదుపులోకి రాలేదు. దీంతో భారీ నష్టం సంభవించింది. దాదాపు 40 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగినట్టు అంచనా వేస్తున్నారు అధికారులు. వరంగల్‌ (Warangal) జిల్లా గీసుకొండ మండలం ధర్మారం గ్రామంలో ఈ అగ్నిప్రమాదం జరిగింది. టెస్కో గోదాంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో అతి కష్టం మీద మంటలను అదుపులోకి తీసుకొచ్చారు అగ్నిమాపక సిబ్బంది. అగ్నిప్రమాదంపై సమాచారం అందుకున్న ఫైర్‌ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మొదట మంటలు ఆర్పేందుకు రెండు ఫైరింజన్లు తీసుకొచ్చారు. అయినా అదుపులోకి రాకపోవడంతో వేరే చోట నుంచి కూడా ఫైర్ ఇంజన్లను తెప్పించారు అధికారులు.

ఈ ప్రమాదంలో సుమారు ముప్పై నుండి నలభై కోట్ల రూపాయల వరకు ఆస్తి నష్టం జరిగి ఉంటుందని టెస్కో అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అగ్నిప్రమాదం సమయంలో గోదాం గోడ కూలడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. అయితే చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా అనేక గోదాములు ఉండడంతో అప్రమత్తమైన పోలీసులు ప్రజలు ఎవరు అక్కడికి రాకుండా అప్రమత్తం చేశారు. దీంతో ప్రాణ నష్టం తప్పింది.

అంతే కాదు చుట్టు పక్కల ప్రాంతాల్లో కూడా ఇంకా అనేక గోదాంలు ఉండటంతో మంటలు వ్యాపిస్తే ఇంకా భారీ నష్టం జరిగి ఉండేదని భావిస్తున్నారు. అయితే పోలీసులు, అధికారులు ముందుగానే అలర్ట్‌ కావడంతో భారీ ముప్పు తప్పింది.

Also Read:

Hyderabad: సమయం లేదు మిత్రమా.. బంపర్ ఆఫర్ మూడు రోజులే.. ఆ తర్వాత మీకు ఫుల్ బ్యాండే..

Ration Card: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. త్వరలో రేషన్‌ కార్డు నిబంధనల్లో మార్పులు..!