ఏకాంతంగా ఉన్నప్పుడే వెళ్తారు.. ఆ తర్వాతే కథ మొదలైద్ది.. వరంగల్‌లో సంచలన ఘటన..

వరంగల్‌ శివారులో గౌతమ్‌ హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఏకాంతంగా కనిపించే ప్రేమజంటలను వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్‌ చేసి డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలతో నలుగురిని అరెస్ట్‌ చేశారు. రోహిత్‌ను బెదిరించే సమయంలో అడ్డుకున్న గౌతమ్‌పై కత్తులతో దాడి చేయడంతో మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ముఠా గతంలో ఇంకా ఎంతమందిని టార్గెట్‌ చేసిందనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోంది.

ఏకాంతంగా ఉన్నప్పుడే వెళ్తారు.. ఆ తర్వాతే కథ మొదలైద్ది.. వరంగల్‌లో సంచలన ఘటన..
Warangal Murder Case

Edited By:

Updated on: Sep 10, 2026 | 9:48 AM

ఈ నెల 4వ తేదీన వరంగల్ శివారు బెస్తం చెరువు సమీపంలో జరిగిన గౌతం అనే యువకుడి మర్డర్ మిస్టరీ వీడింది. అత్యంత దారుణంగా కత్తులతో పొడిచిచంపిన ఉన్మాదులను పోలీసులు అరెస్ట్ చేశారు.. ఆ ముఠాకు ప్రేమజంటలే టార్గెట్ అని పోలీసులు తేల్చారు.. ఏకాంతంగా కనిపించే జంటలను వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తుంటారని తెలిపారు. ఓ వ్యక్తిని బెదిరిస్తున్న క్రమంలో ఆ ముఠాకు అడ్డుచెప్పిన పాపానికి గౌతమ్ అనే అమాయకున్ని హత్య చేశారని తెలిపారు.

వరంగల్ నగరానికి చెందిన కార్ డ్రైవర్ సామల పవన్, డిగ్రీ చదువుతున్న జానకిరామ్, మనోజ్ అనే మరో కార్ డ్రైవర్, హుస్సేన్ అనే యువకుడు ఈ నలుగురు ఒక ముఠాగా ఏర్పడ్డారు.. సిటీ ఔట్ స్కట్స్ బట్టుపల్లి – అమ్మవారిపేట శివారు ప్రాంతాల్లో బైక్స్ పై సంచరిస్తూ ఏకాంతంగా కనిపించే జంటలను ఈ ముఠా టార్గెట్ చేస్తుంది.

ఏకాంతంగా కనిపించే ప్రేమజంటలను వీడియోలు తీసి వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తామని బెదిరింపులకు పాల్పడుతూ డబ్బులు వసూలు చేసేవారు.. డబ్బులు ఇవ్వకపోతే దాడులకు పాల్పడుతుంటారు..ఈ క్రమంలోనే గత నెల 30వ తేదీన బట్టుపల్లి రోడ్డులో ఒక యువతి యువకుడు ఏకాంతంగా వీరు సెల్ ఫోన్ కెమెరాకు చిక్కారు.. వారిని వీడియో తీసి బ్లాక్ మెయిల్ చేశారు.. రోహిత్ అనే యువకుడిని బెదిరించి పదివేల రూపాయలు, బీర్ బాటిల్స్ కాటన్ కావాలని బెదిరించారు.

4వ తేదీన అతన్ని ప్లాన్ ప్రకారం బెస్తం చెరువు వద్దకు పిలిపించారు.. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య మాటా మాటా పెరిగింది.. ఈ ఘర్షణలో రోహిత్ పై ఆ ఉన్మాదులు దాడికి పాల్పడ్డారు.. ఈ క్రమంలో అతని బాబాయ్ గౌతమ్ ఇరువర్గాలను నచ్చజెప్పి అడ్డుకునే ప్రయత్నం చేశారు.. అప్పటికే పథకం ప్రకారం వారి వెంట తెచ్చుకున్న కత్తులతో గౌతంపై విచక్షణ రహితంగా దాడి చేశారు.. ఈ కత్తిపోట్లలో గౌతం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

హత్య అనంతరం కత్తులను చెట్ల పొదల్లో పడేసి నిందితులు పరారయ్యారు.. నలుగురు నిందితులు పవన్, జానకిరామ్, మనోజ్, హుస్సేన్ ను అరెస్ట్ చేసిన పోలీసులు వారిని రిమాండ్ కు పంపారు.

కష్టపడకుండా డబ్బులు సంపాదించి జల్సాలకు అలవాటుపడ్డ ఈ ముఠా అమాయక యువతి యువకులు టార్గెట్ చేసి ప్రేమజంటల లక్ష్యంగా ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారని పోలీసులు తెలిపారు.. ఇంకా ఎంతమందిని ఇలా బెదిరించి దోపిడీలకు పాల్పడ్డారో పూర్తిస్థాయిలో విచారణ జరుపుతామన్నారు.

వీడియో చూడండి..

Loading...
Unable to load recommendations.
Follow Us