Watch: టమాటాలతో ఎంపీ చిత్రపటానికి అభిషేకం.. వినూత్న రీతిలో అభిమానం చాటుకున్న రైతు..

వరంగల్ ఎంపీ కడియం కావ్య పుట్టినరోజు సందర్భంగా రైతులు వినూత్నంగా తమ అభిమానాన్ని చాటుకున్నారు. టమాటా రైతు సముద్రాల మధు ఎంపీ చిత్రపటానికి టన్ను టమాటాలతో అభిషేకం నిర్వహించారు.అనంతరం ఆ టమాటాలను స్తానిక కూలీలు సంచుల్లో నింపుకొని తీసుకెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియోలను అభిమానుల సోషల్‌ మీడియాలో అప్‌లోడ్ చేశారు.

Watch: టమాటాలతో ఎంపీ చిత్రపటానికి అభిషేకం.. వినూత్న రీతిలో అభిమానం చాటుకున్న రైతు..
Telangana News

Edited By:

Updated on: Apr 10, 2026 | 5:26 PM

అభిమాన నాయకులు, అభిమాన తారల జన్మదిన వేడుకలు సందర్భంగా కృతజ్ఞతలు చాటుకోవడం సహజం. అయితే మనం ఇప్పటి వరకు పాలాభిషేకాలు, పుష్పాభిషేకాలు చేయడం, కేక్ లు కట్ చేయడం, ఫ్లెక్సీలు కట్టడం కామన్ గా చూస్తుంటాం. కానీ వరంగల్‌కు చెందిన సముద్రాల మధు అనే ఓ టమాటా రైతు మాత్రం వినూత్నరీతిలో తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఏప్రిల్ 10వ తేదీన వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు కడియం కావ్య జన్మదినం సందర్భంగా తన పంట చేనులోనే టమాటాలతో ఎంపీ ఫ్లెక్సీకి అభిషేకం నిర్వహించాడు. టన్ను లోడ్ టమాటాలతో ఎంపీ చిత్రపటానికి అభిషేకం చేసి తన అభిమానాన్ని చాటుకున్నాడు.

ఇది చూసిన అటుగా వెళ్తున్న వారంతా ఆశ్చర్యపోయారు. అనంతరం స్థానికులు, కూలీలు ఆ టమాటాలు సంచుల్లో నింపుకొని వెళ్లారు.  ఈ సందర్భంగా రైతు మధు మాట్లాడుతూ.. వరంగల్ ప్రజల చిరకాల స్వప్నం మామునూరు ఎయిర్‌పోర్టు పునఃనిర్మాణం.. కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణంలో కడియం కావ్య ఎనలేకి కృష్టి చేశారన్నారు. 40 ఏళ్ల తర్వాత వరంగల్ నుండి ఒక మహిళ పార్లమెంట్ లో శక్తిని చాటుతున్నారని కొనియాడారు.

వీడియో చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us