Viral: ఇది నిజంగానే ‘లివర్’ టచింగ్’ సార్.. కూర పెడతారనుకుంటే మొత్తం మాయం చేశారు.. సీరియస్ మ్యాటర్..

మెను ప్రకారం.. హాస్టల్ లో ఆదివారం రోజున చికెన్ తోపాటు.. బిర్యానీ లేదా పలావును సర్వ్ చేస్తారు. నాన్ వెజ్ ఇష్టపడే చిన్నారులు ఈ ఒక్కరోజు కోసం ఎదురు చూస్తుంటారు. అయితే.. అలానే ఎదురు చూశారు విద్యార్థులు.. ఆదివారం వచ్చింది.. కానీ.. సీన్ రివర్స్ అయింది.

Viral: ఇది నిజంగానే ‘లివర్’ టచింగ్ సార్.. కూర పెడతారనుకుంటే మొత్తం మాయం చేశారు.. సీరియస్ మ్యాటర్..
Chicken Liver

Updated on: Feb 05, 2026 | 11:15 AM

ఆదివారం వచ్చిందంటే చాలు .. చాలా మంది నాన్‌వెజ్ ప్రియులు ఇష్టంగా మటన్, చికెన్, చేపలు తింటారు.. ఈ రోజునే చాలా మంది వీటిని కొని తెచ్చుకుంటారు.. అయితే.. హాస్టల్స్ లో కూడా ఆదివారం రోజునే నాన్‌వెజ్ పెడతారు.. చికెన్ తోపాటు.. పలావు.. రైతా లాంటి పదార్థాలను ఇస్తారు.. ప్రభుత్వం ఆధ్వర్యంలో నడిచే వసతిగృహాల్లో సైతం ఆదివారం రోజున విద్యార్థులకు నాన్ వెజ్ పెడతారు.. మెను ప్రకారం.. ఆదివారం రోజున చికెన్ తోపాటు.. బిర్యానీ లేదా పలావును సర్వ్ చేస్తారు. నాన్ వెజ్ ఇష్టపడే చిన్నారులు ఈ ఒక్కరోజు కోసం ఎదురు చూస్తుంటారు. అయితే.. అలానే ఎదురు చూశారు విద్యార్థులు.. ఆదివారం వచ్చింది.. హాస్టల్ వార్డెన్ చికెన్ తోపాటు కోడి లివర్ ను కూడా కొని తెచ్చారు.. తమకు వేస్తారులే అనుకున్నారు.. కానీ.. సీన్ రివర్స్ అయింది.. రెండు చిన్న ముక్కలు మాత్రమే వేసి.. లివర్ ను మాయం చేయడంతో ఒక్కసారిగా కలకలం రేపింది..

దీంతో విద్యార్థులు ‘మాకు చికెన్‌లో లివర్‌ ముక్కలు వేయకుండా మాయం చేశారు సార్‌’.. అంటూ.. ఏకంగా అధికారులకు ఫిర్యాదు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ వింత ఘటన.. మహబూబాబాద్‌ జిల్లాలోని ఇనుగుర్తి ఎస్సీ బాలుర వసతి గృహంలో చోటుచేసుకుంది.. దీనిపై అధికారులు ఆరా తీస్తున్నారు.

ఇనుగుర్తి మండల కేంద్రంలోని ఎస్సి బాలుర వసతి గృహంలో 60 మందికి పైగా విద్యార్థులు ఉంటూ.. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్నారు. రోజు మెనూ ప్రకారం.. భోజనాన్ని అందిచాలి.. అయితే.. ఆదివారం రోజున విద్యార్థులకు నాన్ వెజ్ ఆహారంగా పెట్టాల్సి ఉంది.. దీంతో విద్యార్థలు వార్డెన్ ను అడగ్గా.. చికెన్ షాప్ కి వెళ్లి.. రెండు కిలోల చికెన్.. లివర్లను తీసుకోవాలని సూచించారు. ఆ తర్వాత వాటిని విద్యార్థులు.. కుక్ కి ఇచ్చారు. వంట తర్వాత ఒక్క విద్యార్థికి కూడా లివర్ రాకపోవడంతో.. అంతా షాకయ్యారు.. ఆ తర్వాత వారు చికెన్ లివర్ ను మాయం చేశారని.. తమకు పెట్టలేందంటూ విద్యార్థులు బుధవారం ఎంపీడీవో బండారు పార్థసారథికి ఫిర్యాదు చేశారు. తమకు చికెన్‌లో లివర్‌ ముక్కలు వేయకుండా మాయం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని.. మెనూ అమలయ్యేలా చూడాలని కోరారు. దీనిపై విద్యాశాఖ అధికారులు ఆరా తీసినట్లు సమాచారం..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..