LS Polls: మెదక్ పార్లమెంట్ స్థానంపై రాములమ్మ ఫోకస్.. సైలంట్ గా లాబీయింగ్

సీనియర్ నటి, రాజకీయ నాయకురాలు విజయశాంతి చాలారోజులుగా మీడియాలో కనిపించడం లేదు. పార్టీ రాజకీయాల్లో చురుగ్గా కనిపించని ఆమె గాంధీభవన్ కు రావడం కూడా చాలా అరుదు. అయితే వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం విజయశాంతి సైలెంట్ గా లాబీయింగ్ చేస్తున్నట్లు సమాచారం.

LS Polls: మెదక్ పార్లమెంట్ స్థానంపై రాములమ్మ ఫోకస్.. సైలంట్ గా లాబీయింగ్
Vijayashanti

Updated on: Mar 20, 2024 | 1:18 PM

సీనియర్ నటి, రాజకీయ నాయకురాలు విజయశాంతి చాలారోజులుగా మీడియాలో కనిపించడం లేదు. పార్టీ రాజకీయాల్లో చురుగ్గా కనిపించని ఆమె గాంధీభవన్ కు రావడం కూడా చాలా అరుదు. అయితే వచ్చే లోక్ సభ ఎన్నికల్లో మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ కోసం విజయశాంతి సైలెంట్ గా లాబీయింగ్ చేస్తున్నట్లు సమాచారం. లోక్ సభ ఎన్నికలకు అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేసిన పీసీసీ స్క్రీనింగ్ కమిటీ తన పేరును పరిగణనలోకి తీసుకోనప్పటికీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో తనకున్న గత సంబంధాలను ఉపయోగించుకుని పార్టీ టికెట్ ఆశిస్తున్నట్లు చెబుతున్నారు.

మంగళవారం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో విజయశాంతి పేరు ప్రస్తావనకు రావడం పీసీసీ చీఫ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆశ్చర్యానికి గురి చేసింది. రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ నుంచి కాంగ్రెస్ లో చేరిన విజయశాంతిని ఎన్నికల సమయంలో తెలంగాణలో పీసీసీ చీఫ్ కోఆర్డినేటర్ గా నియమించారు.

గతంలో విజయశాంతి ఒకసారి బీఆర్ఎస్ నుంచి లోక్ సభకు ఎన్నిక అయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జరిగిన పరిణామాల వల్ల బీజేపీ లో చేరారు. అయితే ప్రస్తుతానికి జహీరాబాద్ నుంచి సురేశ్ కుమార్ షెట్కార్, మహబూబ్ నగర్ నుంచి చల్లా వంశీచంద్ రెడ్డి, నల్లగొండ నుంచి కుందూరు రఘువీర్ రెడ్డి, మహబూబాబాద్ (ఎస్టీ రిజర్వుడ్) నుంచి బలరాం నాయక్ బరిలో నిలిచారు. ఒకట్రెండు రోజుల్లో మరో జాబితా మరికొన్ని ఎంపీల అభ్యర్థుల రెండో జాబితా విడుదలయ్యే అవకాశం ఉంది. మరి ఈ లిస్ట్ లో విజయశాంతికి చోటు దక్కుతుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది.