Corona Vaccination: తెలంగాణలో జోరందుకున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ.. టీకా కేంద్రాలు వెయ్యికి పెంపు..

|

Jan 19, 2021 | 7:48 AM

Corona Vaccination: తెలంగాణలో వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. సోమవారం నాడు 334 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టగా..

Corona Vaccination: తెలంగాణలో జోరందుకున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ.. టీకా కేంద్రాలు వెయ్యికి పెంపు..
Coronavirus Vaccination
Follow us on

Corona Vaccination: తెలంగాణలో వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. సోమవారం నాడు 334 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ చేపట్టగా.. నేటి నుంచి 1,034 కేంద్రాల్లో టీకా కార్యక్రమాన్ని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ మేరకు ఏర్పాట్లు కూడా పూర్తి చేసింది. నిర్ణీత కేంద్రాలకు సంబంధించి ఒక్కో కేంద్రంలో వంద మంది చొప్పున టీకా వేస్తామని ప్రభుత్వ వైద్య ఆరోగ్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. ఆ లెక్కన ఇవాళ దాదాపు లక్ష మందికి టీకా వేసే అవకాశం కనిపిస్తోంది. అయితే, సిబ్బంది కొరత కారణంగా అంతమందికి టీకా వేయడం సాధ్యం కాదని అధికావర్గాలు భావిస్తున్నాయి.

సరాసరిగా 50వేల మందికిపైగా టీకా వేసే అవకాశం ఉందని చెబుతున్నారు. అయితే, ఈ వ్యాక్సినేషన్‌ కోసం ఇప్పటికే జిల్లాలకు 1.70 లక్షల డోసుల పంపిణీ చేసినట్లు రాష్ట్ర పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. కాగా, ఈనెల 21, 22వ తేదీల్లో రాష్ట్రానికి మరో 3.5 లక్షల కోవిడ్ టీకాలు వస్తాయని ప్రభుత్వ వర్గాల సమాచారం. ఈ టీకాలను ప్రభుత్వ వైద్య సిబ్బందితో పాటు.. ప్రైవేటు ఆస్పత్రుల్లో పని చేసే వైద్య సిబ్బందికి కూడా ఇస్తామని తెలిపారు. ఇదిలాఉంటే.. సోమవారం నాడు 334 కేంద్రాల్లో 13,666 మందికి టీకా ఇచ్చినట్లు డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు.