Telangana: లోక్ సభ ఎన్నికల శంఖారావం పూరించిన బీజేపీ.. ఈ నియోజకవర్గాల్లో ప్రధాని మోదీ బహిరంగ సభలు..

సిద్దిపేటలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎన్నికల శంఖారావం పూరించారు. సిద్ధిపేట జిల్లా కేంద్రం డిగ్రీ కాలేజీ మైదానంలో ‘బీజేపీ విశాల జన సభ’ను నిర్వహించింది. తెలంగాణలో కనీసం 12 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలని ఓటర్లను కోరారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా. మరోసారి నరేంద్ర మోదీని ప్రధానిని చేయాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. దేశవ్యాప్తంగా 400కు పైగా స్థానాల్లో కమలాన్ని వికసింపజేయాలన్నారు ఆయన.

Telangana: లోక్ సభ ఎన్నికల శంఖారావం పూరించిన బీజేపీ.. ఈ నియోజకవర్గాల్లో ప్రధాని మోదీ బహిరంగ సభలు..
Amit Shah
Follow us

|

Updated on: Apr 25, 2024 | 7:56 PM

సిద్దిపేటలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఎన్నికల శంఖారావం పూరించారు. సిద్ధిపేట జిల్లా కేంద్రం డిగ్రీ కాలేజీ మైదానంలో ‘బీజేపీ విశాల జన సభ’ను నిర్వహించింది. తెలంగాణలో కనీసం 12 లోక్‌సభ స్థానాల్లో బీజేపీ అభ్యర్ధులను గెలిపించాలని ఓటర్లను కోరారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా. మరోసారి నరేంద్ర మోదీని ప్రధానిని చేయాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. దేశవ్యాప్తంగా 400కు పైగా స్థానాల్లో కమలాన్ని వికసింపజేయాలన్నారు ఆయన. రానున్న లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మెదక్‌ బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావుకు మద్దతుగా ఆయన ప్రచారం నిర్వహించారు.

గత పదేళ్లలో కేంద్ర ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు చెప్పారు షా. కోర్టు వివాదంలో గెలిచి.. అయోధ్యలో రామ మందిరం నిర్మాణానికి మోదీ కృషి చేశారన్నారు. కశ్మీర్‌ను భారత్‌లో శాశ్వతంగా అంతర్భాగం చేయాలన్న పట్టుదలతో ముందుకెళ్తున్నారని తెలిపారు. మోదీని మూడోసారి ప్రధానిని చేస్తే అవినీతి అంతానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణ విమోచన దినోత్సవం నిర్వహించాల్సి ఉందన్న అమిత్‌ షా.. మజ్లిస్‌కు భయపడటం వల్లే బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నిర్వహించడం లేదని దుయ్యబట్టారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక సెప్టెంబర్‌ 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కచ్చితంగా నిర్వహిస్తామని చెప్పారు.

ఇక గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు షా. మల్లన్న సాగర్‌, కొండపోచమ్మ ప్రాజెక్ట్ పేరుతో గ్రామాలు ఖాళీ చేయించిన ఘనత అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌, బీర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డిదేనని విమర్శించారు. ఇక బీజేపీ అభ్యర్థి రఘునందన్‌ రావు కూడా అధికార, విపక్షాల టార్గెట్‌గా కామెంట్స్‌ చేశారు. కేసీఆర్ కాళ్ళు మొక్కినందుకు వెంకట్రామిరెడ్డికి ఎమ్మెల్సీ ఇచ్చారన్నారు. 3 సంవత్సరాల కాలంలో నియోజకవర్గానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వని ఆయన.. ఇప్పుడు100 కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి చేస్తా అని చెప్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక బీజేపీ పెద్దలు వరుస సభలతో హోరెత్తించనున్నారు. ఈనెల 30, మే 3, 4 తేదీలలో ప్రధాని మోదీ తెలంగాణ వస్తున్నారు. హైదరాబాద్‌, నారాయణపేట, చేవెళ్లలో ఆయన ప్రచారం చేయనున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Latest Articles
వారఫలాలు: శుభగ్రహాల సంచారం.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం..
వారఫలాలు: శుభగ్రహాల సంచారం.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం..
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!