Hyderabad: కూకట్‌పల్లిలో కూలిన భవనం.. ఇద్దరు మృతి.. ఘటనపై ఎన్నో అనుమానాలు..

|

Jan 07, 2023 | 9:03 PM

కూకట్‌పల్లిలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఓ భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. నాలుగో అంతస్తుకు శ్లాబ్‌ పనులు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఉత్తరప్రదేశ్ కు చెందిన ఇద్దరు కూలీలు ప్రాణాలు...

Hyderabad: కూకట్‌పల్లిలో కూలిన భవనం.. ఇద్దరు మృతి.. ఘటనపై ఎన్నో అనుమానాలు..
Building Collapse
Follow us on

హైదరాబాద్ లోని కూకట్‌పల్లిలో ఘోర ప్రమాదం జరిగింది. నిర్మాణంలో ఉన్న ఓ భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. నాలుగో అంతస్తుకు శ్లాబ్‌ పనులు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఉత్తరప్రదేశ్ కు చెందిన ఇద్దరు కూలీలు ప్రాణాలు కోల్పోయారు. శిథిలాల కింద ఎవరైనా ఉన్నారేమోనని స్థానికులు అనుమానిస్తున్నారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసు, రెవెన్యూ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. 4,5 వ అంతస్తుకు స్లాబ్ పనులు చేస్తుండగా ఒక్కసారిగా కూలిపోయింది స్లాబ్. శిథిలాలు తొలగించే పనిలో రెస్క్యూ టీమ్ నిమగ్నమైంది. అసలు ప్రమాదం ఎలా జరిగింది? నిర్మాణంలో ఉన్న భవనం కింద ఎంతమంది ఉన్నారు అనేది అధికారులు ఆరా తీస్తున్నారు.

కూకట్ పల్లిలో కూలిన నిర్మాణ భవన అనుమతుల్లో డొల్ల కనిపిస్తోంది. G+2 కి పర్మిషన్ తీసుకొని ఐదు అంతస్థుల నిర్మాణం చేపట్టినట్టు అధికారులు గుర్తించారు. నిర్మాణంలో సేఫ్టీ కూడా ఏ మాత్రం పాటించలేదు. పూర్తి నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగింది. బిల్డింగ్ ఓనర్‌తో పాటు పలువురు కూలీలకు గాయాలయ్యాయి. రెడీ మిక్స్ వేసిన మిగిలిన కూలీల ఫిర్యాదు ఆధారంగా.. బిల్డింగ్ యజమాని లక్ష్మణ్‌రావుపై జీహెచ్ ఎంసీ అధికారులు క్రిమినల్ కేసు నమోదు చేస్తామంటున్నారు.

ఈ ఘటనకు పూర్తి బాధ్యత.. బిల్డింగ్ ఓనర్‌దే అంటున్నారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు. అతని దగ్గర నుంచే కూలీల కుటుంబాలకు పరిహారం అందేలా చేస్తామంటున్నారు. స్లాబ్ దిమ్మెలను కిందకి దించేందుకు భారీ క్రేన్ తెప్పించారు. ఇరుకు వీధిలో భవనం ఉండటంతో సహాయక చర్యలు చేయడంలో ఇబ్బందులు ఎదురయ్యాయి. ప్రమాదంలో మృతి చెందారన్న విషయం తెలుసుకున్న మృతుల కుటుంబీకులు కన్నీటి పర్యంతమవుతున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..