Telangana: తెలంగాణ ఆర్టీసీ(TS RTC) సరికొత్త ప్రయోగాలతో లాభార్జన వైపు పరుగులు తీస్తోంది. ఎండీ సజ్జనార్ (MD Sajjanar) తీవ్ర నష్టాలతో కొట్టుమిట్టాడుతున్న సంస్థను క్రమంగా ప్రజలకు చేరువ చేస్తూ లాభాల బాట ఎక్కించేందుకు వినూత్న చర్యలు తీసుకుంటున్నారు. నిత్యం కొత్త సర్వీసులు, ట్రిప్పులు, ఆఫర్లతో ప్రజలకు ఆర్టీసీని మరింత చేరువ చేస్తున్నారు. తాజాగా ఆయన మరో సర్వీసుతో ముందుకు వచ్చారు. మధురమైన మామిడిపండ్లు తోట నుంచి నేరుగా ఇంటి వద్దకే డెలివరీ చేయనున్నట్లు ట్విటర్ వేదికగా తెలిపారు. టీఎస్ఆర్టీసీ కార్గో పార్సిల్ ద్వారా ఈ సర్వీసు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. చెమటోడ్చి ఆకలిని తీర్చే.. అన్నదాత రైతన్నను ఆదుకోండి అంటూ ట్వీట్‌లో కోరారు.
#mangoes మధురమైన మామిడిపండ్లు తోట నుండి నేరుగా మీ ఇంటి వద్దకే. చెమటోడ్చి ఆకలిని తీర్చే అన్నదాత రైతన్నను ఆదుకోండి. ఆదుర్దా ఎందుకు #TSRTCCargoParcel అండగా ఉండగా. @TSRTCHQ Beat the Heat with #TSRTCMangoes @TV9Telugu @pargaien #support #tuesdayvibe @V6News #organic #farmers pic.twitter.com/mczKzGeAz6
— V.C Sajjanar IPS MD TSRTC Office (@tsrtcmdoffice) May 3, 2022
మామిడి పండ్లను పోస్టల్ ద్వారా డెలివరీ తీసుకోవాలనుకునే వినియోగదారులు కిలోకు రూ.115 చెల్లించాల్సి ఉంది. ఒకరు 5 కిలోలు, 10 కిలోలు, 15 కిలోలు లేదా టన్నులలో ఆర్డర్ చేయవచ్చు. బుకింగ్‌ల కోసం https://www.tsrtcparcel.in/ TSCounter/Account/Products ని సందర్శించాలని సూచించారు. లేదా 040-2345003, 040-69440000 నంబర్లలో సంప్రదించాలని కోరారు
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Also Read: World Asthma Day: కాలుష్యంతో పిల్లల్లో పెరుగుతున్న ఆస్తమా.. ప్రపంచంలోనే మనదేశంలోనే అత్యధిక కేసులు