బమ్మెర పోతనకు మంత్రుల నివాళులు.. పోతన వైశిష్ట్యం ఉట్టిపడే విధంగా టూరిజం అభివృద్ధి పనులు -ఎర్రబెల్లి, శ్రీనివాస్‌గౌడ్‌

|

Jan 30, 2021 | 10:44 PM

జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని బమ్మెర గ్రామంలో రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తో కలిసి పర్యాటక శాఖ..

బమ్మెర పోతనకు మంత్రుల నివాళులు.. పోతన వైశిష్ట్యం ఉట్టిపడే విధంగా టూరిజం అభివృద్ధి పనులు -ఎర్రబెల్లి, శ్రీనివాస్‌గౌడ్‌
Follow us on

జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని బమ్మెర గ్రామంలో రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తో కలిసి పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పర్యటించారు. అక్కడ జరుగుతున్న టూరిజం అభివృద్ధి పనులను పరిశీలించారు

బమ్మెరలో ఉన్న సహజ కవి బమ్మెర పోతన సమాధిని సందర్శించారు. పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు బమ్మెర లో పోతన పేరు తో ఒక ఆధునిక కళాక్షేత్రాన్ని నిర్మిస్తున్నట్లు మంత్రులు తెలిపారు. సుమారు 10 కోట్ల రూపాయల తో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చెప్పారు.

ఆడిటోరియం, అక్షరాభ్యాస కేంద్రం, పోతన రచించిన గ్రంథాలను, వారి జ్ఞాపకాలను భద్రపరించేందుకు గ్యాలరీ లను నిర్మిస్తున్నట్లు మంత్రులు వెల్లడించారు. పోతన మాత్యుల కళాక్షేత్రాన్ని 6 నెలల్లో పూర్తి చేయాలని అధికారులను మంత్రులు ఆదేశించారు. పోతన వైశిష్ట్యాన్ని తెలిపే విధంగా బమ్మెరను అభివృద్ధి పరుస్తామని మంత్రులు తెలిపారు.