మంత్రి కేటీఆర్ నేడు సిరిసిల్ల జిల్లా లో పర్యటన, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇవాళ సిరిసిల్ల జిల్లా లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఉదయం 10:30 గంటలకు గంభీరావుపేట హెడ్ క్వార్టర్ లో..

మంత్రి కేటీఆర్ నేడు సిరిసిల్ల జిల్లా లో పర్యటన, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు

Updated on: Feb 08, 2021 | 5:48 AM

తెలంగాణ మంత్రి కేటీఆర్ ఇవాళ సిరిసిల్ల జిల్లా లో పర్యటిస్తారు. ఈ సందర్భంగా జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఉదయం 10:30 గంటలకు గంభీరావుపేట హెడ్ క్వార్టర్ లో మండల రైతువేదిక, ప్రభుత్వ పాఠశాల, డిగ్రీ కళాశాల ప్రారంభోత్సవం కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొంటారు. అనంతరం ఆయన విద్యార్థులతో సమావేశమవుతారు. మధ్యాహ్నం 12:30 గంటలకు నర్మాలలో రైతు వేదిక ప్రారంభోత్సవం, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కు కేటీఆర్ శంకుస్థాపన చేస్తారు. తదనంతరం పబ్లిక్ మీటింగ్ లో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. మధ్యాహ్నం 1:30 గంటలకు కొత్తపల్లి లో మహిళ సంఘ భవనం, శ్మశానవాటిక, పాఠశాలలో అదనపు తరగతి గదులకు ప్రారంభోత్సవం చేస్తారు కేటీఆర్. మధ్యాహ్నం 2 గంటలకు లింగన్నపేటలో రైతువేదిక ప్రారంభోత్సవం, మధ్యాహ్నం 2:30 గంటలకు మల్లారెడ్డిపేటలో రైతువేదిక ప్రారంభోత్సవం, మధ్యాహ్నం 3:00 గంటలకు సముద్రలింగాపూర్లో రైతువేదిక, పల్లె ప్రకృతివనం, శ్మశానవాటిక, గొర్రెల షెడ్లు ప్రారంభిస్తారు మంత్రి కేటీఆర్.

ఫస్ట్ జర్నీ ఫ్యామిలీ కోసం అంకితం, అమెరికా అధ్యక్షుడు ప్రయాణించే ఎయిర్‌ఫోర్స్‌ వన్‌లో ప్రయాణం ప్రపంచంలోనే ప్రత్యేకం

Loading...
Unable to load recommendations.
Follow Us