Harish Rao: ఈటలది తల్లిపాలు తాగి రొమ్ముగుద్దే చందం. అసలు.. బొట్టుబిళ్లలు ఎందుకు పంచుతున్నారు.?: హరీశ్‌రావు

ఈటల రాజేందర్ వ్యవహారం తల్లిపాలు తాగి రొమ్ముగుద్దిన చందంగా ఉందని తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. అసలు ఎందుకు

Harish Rao: ఈటలది తల్లిపాలు తాగి రొమ్ముగుద్దే చందం. అసలు.. బొట్టుబిళ్లలు ఎందుకు పంచుతున్నారు.?: హరీశ్‌రావు
Harish In Kamalapur

Updated on: Sep 13, 2021 | 4:53 PM

Etela Rajender – Harish Rao: ఈటల రాజేందర్ వ్యవహారం తల్లిపాలు తాగి రొమ్ముగుద్దిన చందంగా ఉందని తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. అసలు ఎందుకు ఈటల బొట్టుబిళ్లలు, కుట్టుమిషన్లు, గడియారాలు పంచుతున్నారని హరీశ్‌రావు ప్రశ్నించారు. ఇవాళ కమలాపూర్ నిర్వహించిన బహిరంగ సభలో హరీష్ రావు ఈ వ్యాఖ్యలు చేశారు. “హుజురాబాద్‌ అసెంబ్లీ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ గెలుపు ఖాయమైంది. ప్రతిపక్షాలు సెకండ్ ప్లేస్ కోసం పోటీ పడుతున్నాయి. TRS గెలుపు తేలింది.. మెజారిటీ ఎంత అనేది తేలాలి. తెలంగాణకు బీజేపీ ఎం చేసింది?. గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచింది తప్ప ప్రజలకు ఏం చేసిందో చెప్పాలి.” అని హరీశ్ సభాముఖంగా కేంద్రంలోని బీజేపీ సర్కారుని డిమాండ్ చేశారు.

“కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక అన్నింటినీ అమ్మేస్తున్నారు. అమ్మకాలకే ఓ శాఖ పెట్టింది కేంద్రం. అమ్మకానికి పెట్టింది పేరు బీజేపీ.. నమ్మకానికి పెట్టింది పేరు టీఆర్ఎస్. ప్రభుత్వాలు ఆస్థులను అమ్మొద్దు క్రియేట్ చేయాలి. ఈటల రాజేందర్ ది మొసలి కన్నీరు. ఈటల సొంతూరులో కేసీఆర్ 4వేల డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తే ఒక్క ఇళ్లూ నిర్మాణం జరగలేదు. టీఆర్ఎస్ పార్టీ ఈటెలకు ఒక్క ముఖ్యమంత్రి పదవి తప్ప అన్ని పదవులు కల్పించింది. ఈటల వ్యవహారం తల్లిపాలు తాగి రొమ్ముగుద్దిన చందంగా ఉంది. ఆత్మగౌరవం గురించి మాట్లాడే ఈటల రాజేందర్ బొట్టుబిళ్లలు, కుట్టు మిషన్లు, గడియారాలు ఎందుకు పంచుతున్నారు. రాష్ట్రం అంతా హుజూరాబాద్ వైపే చూస్తోంది.. ఆలోచించి ఓటు వేయాలి.” అని హరీశ్ రావు అన్నారు. హుజూరాబాద్ ఉపఎన్నికలో విపక్షాలు సెకండ్ స్థానం కోసం పోటీ పడుతున్నాయని చెప్పుకొచ్చిన హరీశ్.. తెలంగాణలో టీఆర్ఎస్ తో ఏపార్టీ పోటీ పడలేదని తేల్చి చెప్పేశారు.

Read also:  Ganesh Immersion: గణేశ్ నిమజ్జనంపై ప్రభుత్వం వేసిన రివ్యూ పిటిషన్ కొట్టివేత.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు