Omicron Variant: కొత్త వేరియంట్‌పై తెలంగాణ సర్కార్ అలెర్ట్.. రేపు అత్యవసర సమావేశం..

Omicron Virus: దక్షిణాఫ్రికాతో పాటు పలు దేశాల్లో కలకలం సృష్టిస్తున్న కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌పై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో

Omicron Variant: కొత్త వేరియంట్‌పై తెలంగాణ సర్కార్ అలెర్ట్.. రేపు అత్యవసర సమావేశం..
Omicron Variant

Updated on: Nov 27, 2021 | 5:44 PM

Omicron Virus: దక్షిణాఫ్రికాతో పాటు పలు దేశాల్లో కలకలం సృష్టిస్తున్న కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌పై తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు వైద్య, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి హరీశ్‌రావు ఆదివారం సమావేశం నిర్వహించనున్నారు. కొత్త వేరియంట్‌ శరవేగంగా వ్యాపిస్తున్న దేశాల నుంచి వచ్చే ప్రయాణికుల విషయంలో తీసుకోవాల్సిన చర్యలపై తెలంగాణ ప్రభుత్వం సమీక్షించనుంది. ఇదే విషయంపై కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేసిన విషయం తెలిసిందే. దీనిపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ సైతం అధికారులతో సమీక్షించారు. ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలను అప్రమత్తం చేస్తూ తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. దీంతోపాటు పలు దేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులను క్వారంటైన్ చేయాలని ఆదేశించారు. దీంతోపాటు కరోనా పరీక్షలను పెంచాలని, వ్యాక్సినేషన్‌ను శరవేగంగా పూర్తిచేయాలని సూచించారు.

ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా నుంచి నేరుగా హైదరాబాద్‌కు విమానాలు లేని కారణంగా ముంబయి, ఢిల్లీలో దిగి ఇక్కడికి వచ్చే వారిని ట్రేసింగ్‌, టెస్టింగ్‌ చేయడం సహా పలు అంశాలపై హరిశ్‌రావు రేపు జరిగే సమావేశంలో చర్చించనున్నారు. అంత‌ర్జాతీయ ప్రయాణికులపై పలు రాష్ట్రాలు ఇప్పటికే ఆంక్షలు విధించాయి. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కూడా కరోనా కొత్తవేరియంట్ బాధితుల ట్రేసింగ్, టెస్టింగ్‌పై పలు మార్గర్శకాలను విడుదల చేయనుంది. కాగా.. ఇప్పటికే మహారాష్ట్ర ప్రభుత్వం పలు దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు రెండు కరోనా డోసులు తీసుకోని ఉండాలని.. మార్గర్శకాలను పాటించాలని ఆంక్షలు విధించింది.

Also Read:

Holidays 2022: వచ్చే ఏడాది సెలవులు, పండుగలు ఇవే.. జాబితాను విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం

Telangana: చలానాల భారం పడలేక నడి రోడ్డుపై బైక్ తగలబెట్టాడు…

Follow Us