దుబ్బాక ఉప ఎన్నికలో గుణపాఠం

దుబ్బాక ఉపఎన్నికలో టీఆర్‌ఎస్ కు తెలంగాణ ప్రజలు గుణపాఠం చెబుతారని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. నర్సంపేట లో 25 కోట్ల విలువైన స్థలం ఆక్రమణకు టీఆర్‌ఎస్‌ నాయకులు కుట్ర పన్నుతున్నారని సంజయ్ ఆరోపించారు.

దుబ్బాక ఉప ఎన్నికలో గుణపాఠం

Updated on: Sep 04, 2020 | 6:41 PM

దుబ్బాక ఉపఎన్నికలో టీఆర్‌ఎస్ కు తెలంగాణ ప్రజలు గుణపాఠం చెబుతారని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. నర్సంపేట లో 25 కోట్ల విలువైన స్థలం ఆక్రమణకు టీఆర్‌ఎస్‌ నాయకులు కుట్ర పన్నుతున్నారని సంజయ్ ఆరోపించారు. కరోనా నివారణ నిమిత్తం తెలంగాణకు కేంద్రం ఇచ్చిన ఏడువేల కోట్ల రూపాయల నిధులు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. ఆ నిధులను ముఖ్యమంత్రి కేసీఆర్ దారి మళ్లించారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వం కనీసం ప్రభుత్వ వైద్యశాలలో సౌకర్యాలు కల్పించలేదని ఆరోపణలు గుప్పించారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్న కేసీఆర్‌కు శాశ్వతంగా జైల్లో ఉండే రోజులు దగ్గర పడుతున్నాయని బండి సంజయ్ హెచ్చరించారు.

Loading...
Unable to load recommendations.
Follow Us