ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్‌కృష్ణారెడ్డికి పోటెన్సీ టెస్ట్.. మరో కీలక అప్డేట్ వచ్చేసింది..

ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్‌కృష్ణారెడ్డి కేసులో మరో కీలక అప్డేట్ వచ్చింది. ఆయనకు పోటెన్సీ టెస్టులు నిర్వహించాలంటూ రాజేంద్రనగర్ కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. దీనిని సవాల్ చేస్తూ తెలంగాణ హైకోర్టులో ఉదయ్ కృష్ణారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది.

ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్‌కృష్ణారెడ్డికి పోటెన్సీ టెస్ట్.. మరో కీలక అప్డేట్ వచ్చేసింది..
Uday Krushna Reddy

Edited By:

Updated on: Aug 31, 2026 | 7:51 PM

ట్రైనీ ఐపీఎస్ అధికారి ఉదయ్‌కృష్ణారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. తనకు పోటెన్సీ పరీక్షలు నిర్వహించవద్దంటూ ఆదేశాలు ఇవ్వాలని ఆయన తన పిటిషన్‌లో న్యాయస్థానాన్ని కోరారు. ఈ కేసులో ఇదివరకే లింగపటుత్వ పరీక్ష నిర్వహించాలని సూచిస్తూ రాజేంద్రనగర్ (ఉప్పరపల్లి) కోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆయన హైకోర్టును ఆశ్రయించారు. పిటిషన్‌ను పరిశీలించిన ఉమ్మడి న్యాయస్థానం, దీనిపై తదుపరి విచారణను మరుసటి రోజుకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

ఈ కేసు నేపథ్యాన్ని పరిశీలిస్తే.. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ (SVPNPA)లో శిక్షణ పొందుతున్న ఒక తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ అధికారిణి ఉదయ్‌కృష్ణారెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేశారు. తనపై లైంగిక దాడికి పాల్పడటంతో పాటు బెదిరింపులకు గురిచేశాడని ఆమె పేర్కొనడంతో అత్తాపూర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ జరిపి ఉదయ్‌కృష్ణారెడ్డిని అరెస్ట్ చేయగా.. ప్రస్తుతం ఆయన చంచల్‌గూడ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us