Tragedy : కామారెడ్డి జిల్లాలో విషాదం.. మంజీరా నదిలో శవాలుగా మారిన నలుగురు కుటుంబ సభ్యులు

|

Jun 26, 2021 | 10:07 AM

కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం సెట్లూరు గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గ్రామ శివారులోని మంజీరా పరివాహక ప్రాంతంలో నిన్న సాయంత్రం గుడి దర్శనానికి వెళ్లి..

Tragedy : కామారెడ్డి జిల్లాలో విషాదం.. మంజీరా నదిలో శవాలుగా మారిన నలుగురు కుటుంబ సభ్యులు
River
Follow us on

Manjira river : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలం సెట్లూరు గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గ్రామ శివారులోని మంజీరా పరివాహక ప్రాంతంలో నిన్న సాయంత్రం గుడి దర్శనానికి వెళ్లి ఒక కుటుంబం అదృశ్యమైంది. దీంతో తప్పిపోయారనుకొని బంధువులు పలు చోట్ల వెతికినప్పటికీ ప్రయోజనం లేకపోయింది.

అయితే, ఈ ఉదయం తప్పిపోయిన వారంతా మంజీరా నదిలో శవాలుగా తేలారు. తల్లి, ఇద్దరు అమ్మాయిలు , ఒక అబ్బాయి మొత్తం నలుగురూ నదిలో మునిగి చనిపోయారు. ఇప్పటికి ముగ్గురి శవాలు (తల్లి, ఒక అబ్బాయి, ఒక అమ్మాయి) లభ్యమయ్యాయి. మరో అమ్మాయి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

మృతుల పేర్లు, వయసు :
1. అంజవ్వ (40)
2. సోనీ (17)
3. చింటూ (07)
4. గంగోత్రి (12)

రైతుల క్రాప్ లోన్ సోమ్ములు స్వాహా.. బెట్టింగులకు బ్యాంక్ మనీ వాడుకున్న అసిస్టెంట్ మేనేజర్.!

పశ్చిమ గోదావరి జిల్లాలో బెట్టింగులకోసం బ్యాంకు సొమ్ము స్వాహా చేసిన ఒక అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్ బాగోతం బట్టబయలైంది. ఆచంట మండలం ఆచంట యూనియన్ బ్యాంక్ లో సదరు బ్యాంక్ మేనేజర్ రూ. 30 లక్షలు స్వాహా చేశాడు. సదరు బ్యాంకులో అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్ గా పనిచేస్తోన్న నాగరాజు 30 లక్షల రూపాయలు వేరే ఖాతాలకు మళ్ళించినట్లు అధికారులు గుర్తించారు.

ఈ సొమ్మంతా 40 మంది రైతుల క్రాప్ లోన్ మనీ అని బ్యాంక్ ఉన్నతాధికారులు తేల్చారు. నేరం రుజువు కావడంతో అసిస్టెంట్ మేనేజరు నాగరాజును యూనియన్ బ్యాంక్ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. అసిస్టెంట్ మేనేజర్ నాగరాజు మీద పోలీసు కేసు పెడతామని బ్యాంకు అధికారులు తెలిపారు.

Read also : EGS : ఉపాది హామీ కూలీల దగ్గర లంచం తీసుకుంటూ వీడియో రికార్డింగ్‌లో దొరికిపోయిన ఫీల్డ్ అసిస్టెంట్ సస్పెన్షన్