AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: సోమవారం తెరుచుకున్న క్లాస్ రూమ్.. కనిపించిన సీన్ చూసి విద్యార్థుల పరుగో.. పరుగు!

సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం పొలుమళ్ల గ్రామంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం (జూలై 06) ఉదయం పాములు ప్రత్యక్షమవడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. తరగతి గదిలో ఒకేసారి మూడు పాము పిల్లలు కనిపించడంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురై కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశారు.

Video: సోమవారం తెరుచుకున్న క్లాస్ రూమ్.. కనిపించిన సీన్ చూసి విద్యార్థుల పరుగో.. పరుగు!
Zp High School, Suryapet District
M Revan Reddy
| Edited By: |

Updated on: Jul 06, 2026 | 4:54 PM

Share

సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం పొలుమళ్ల గ్రామంలోని ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం (జూలై 06) ఉదయం పాములు ప్రత్యక్షమవడంతో ఒక్కసారిగా కలకలం రేగింది. తరగతి గదిలో ఒకేసారి మూడు పాము పిల్లలు కనిపించడంతో విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురై కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశారు.

సమాచారం అందుకున్న పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది వెంటనే అప్రమత్తమై విద్యార్థులను సురక్షితంగా తరగతి గదుల నుంచి బయటకు తీసుకువచ్చారు. అనంతరం పాములను జాగ్రత్తగా అక్కడి నుంచి తరిమివేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పాఠశాల ఆవరణలో పొదలు, చెత్త పేరుకుపోవడం లేదా వర్షాకాలం కారణంగా పాములు తరగతి గదుల్లోకి వచ్చి ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. ఈ ఘటనతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

పాఠశాల పరిసరాలను పూర్తిగా శుభ్రం చేయడంతో పాటు, పాములు వంటి విషజంతువులు పాఠశాల ఆవరణలోకి రాకుండా తగిన భద్రతా చర్యలు చేపట్టాలని తల్లిదండ్రులు అధికారులను కోరుతున్నారు. విద్యార్థుల భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
క్లాస్‌రూమ్‌లో కనిపించిన సీన్ చూసి జడుసుకున్న విద్యార్థులు!
క్లాస్‌రూమ్‌లో కనిపించిన సీన్ చూసి జడుసుకున్న విద్యార్థులు!
పిల్లల గదిని ఇలా అలంకరిస్తే మంచిది.. కానీ ఈ వస్తువులు మాత్రం..
పిల్లల గదిని ఇలా అలంకరిస్తే మంచిది.. కానీ ఈ వస్తువులు మాత్రం..
పాపికొండల టూర్‌కు గ్రీన్ సిగ్నల్ ఈ యాత్ర ఎందుకంత స్పెషల్?
పాపికొండల టూర్‌కు గ్రీన్ సిగ్నల్ ఈ యాత్ర ఎందుకంత స్పెషల్?
జుట్టు ఊడదు.. పైగా కుదుళ్లు బలంగా మారతాయ్.. పూర్వీకుల చిట్కా ఇదే
జుట్టు ఊడదు.. పైగా కుదుళ్లు బలంగా మారతాయ్.. పూర్వీకుల చిట్కా ఇదే
కష్టాల్లో గోడలా నిలబడి టీమిండియాను ఆదుకున్న అన్వయ్ ద్రావిడ్
కష్టాల్లో గోడలా నిలబడి టీమిండియాను ఆదుకున్న అన్వయ్ ద్రావిడ్
అరుదైన ఘట్టం.. 116 ఏళ్ల భక్తురాలికి తిరుమలలో వీఐపీ దర్శనం
అరుదైన ఘట్టం.. 116 ఏళ్ల భక్తురాలికి తిరుమలలో వీఐపీ దర్శనం
E20 పెట్రోల్‌తో ఇంజిన్ పాడవుతుందా? 10 పాయింట్లతో కేంద్రం క్లారిటీ
E20 పెట్రోల్‌తో ఇంజిన్ పాడవుతుందా? 10 పాయింట్లతో కేంద్రం క్లారిటీ
పెళ్లి వేడుకలో మునిగిపోయిన బంధుమిత్రులు ఇంతలో ఊహించని ఘటన
పెళ్లి వేడుకలో మునిగిపోయిన బంధుమిత్రులు ఇంతలో ఊహించని ఘటన
కిచెన్‌లో మిగిలిపోయే నూనెతో ఇలా చేయండి.. పైసా వసూల్ ట్రిక్..
కిచెన్‌లో మిగిలిపోయే నూనెతో ఇలా చేయండి.. పైసా వసూల్ ట్రిక్..
ఎగసిపడుతున్న బొగత..తొలకరి వరదతో పరవళ్లు
ఎగసిపడుతున్న బొగత..తొలకరి వరదతో పరవళ్లు