AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: టీచర్లకు గుడ్ న్యూస్.. ప్రమోషన్ల షెడ్యూల్ విడుదల చేసిన ప్రభుత్వం.. 10రోజుల్లోనే ప్రక్రియ పూర్తి..

టీచర్లకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ప్రమోషన్లకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసింది. మొత్తం 10 రోజుల్లో టీచర్ల ప్రమోషన్స్ పూర్తి కానున్నాయి. దాదాపు 3900 మందికి ప్రమోషన్లు లభించనున్నాయి. 900 వరకు ప్రధానోపాధ్యాయ పోస్టులు ఖాళీ ఉండగా.. 900 మంది స్కూల్​ అసిస్టెంట్లకు గెజిటెడ్ హెడ్ మాస్టర్లుగా​ ప్రమోషన్ లభించనుంది.

Telangana: టీచర్లకు గుడ్ న్యూస్.. ప్రమోషన్ల షెడ్యూల్ విడుదల చేసిన ప్రభుత్వం.. 10రోజుల్లోనే ప్రక్రియ పూర్తి..
Telangana Teachers Promotions
Krishna S
|

Updated on: Jul 31, 2025 | 8:03 PM

Share

టీచర్లకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది. టీచర్ల ప్రమోషన్లకు సంబంధించిన షెడ్యుల్‌ను విద్యాశాఖ విడుదల చేసింది. ఆగస్టు 2 నుంచి ప్రమోషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆగస్టు 11 వరకు దీనిని పూర్తి చేయాలని నిర్ణయించింది. మొత్తం 10 రోజుల్లో టీచర్ల ప్రమోషన్స్ పూర్తి కానున్నాయి. జూన్  30 వరకు ఖాళీ అయిన స్థానాలతో భర్తీ చేయనున్నారు. దీనికి ముందే ట్రాన్స్‌ఫర్స్ చేపట్టాల్సి ఉండగా.. స్కూల్స్ ప్రారంభమవడంతో ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని వాయిదా వేసింది. అయితే ప్రమోషన్లు మాత్రం కల్పించాలని నిర్ణయించింది.

కాగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 3,900 మందికి పదోన్నతులు లభించనున్నాయి. 900 వరకు ప్రధానోపాధ్యాయ పోస్టులు ఖాళీ ఉన్నాయి. దీంతో 900 మంది స్కూల్​ అసిస్టెంట్లకు గెజిటెడ్ హెడ్ మాస్టర్లుగా​ ప్రమోషన్ లభించనుంది. దీంట్లో మల్టీజోన్-1లో 492, మల్టిజోన్-2లో411 పోస్టులు ఉన్నాయి. అంతేకాకుండా ప్రాథమిక పాఠశాల హెడ్ మాస్టర్ పోస్టులు 641వరకు ఖాళీ ఉన్నాయి. వాటిని ఎస్జీటీలకు ప్రమోషన్లు ఇచ్చి భర్తీ చేయనున్నారు. ప్రమోషన్ల వల్ల ఖాళీ అయ్యే స్కూల్ అసిస్టెంట్ పోస్టులను ఎస్జీటీలతో భర్తీ చేస్తారు. అటు పీఈటీ, లాంగ్వేజ్ పండితులకు సైతం ప్రమోషన్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి.

ప్రస్తుతం విద్యాశాఖ సీఎం రేవంత్ రెడ్డి దగ్గరే ఉంది. విద్యావ్యవస్థను బలోపేతం చేయడమే తన లక్ష్యమని రేవంత్ ఇప్పటికే పలుమార్లు చెప్పారు. ఇతరులకు ఇస్తే శాఖను పట్టించుకుంటారో లేదో అనే సందేహాంతో తన వద్దే ఉంచుకున్నట్లు చెప్పారు. అటు పలు పాఠశాలల్లో రెగ్యులర్ హెచ్ఎం లేకపోవడంతో పలు సమస్యలు నెలకొంటున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..