Hanumakonda: సర్పంచ్‌ కట్టించిన కొత్త శ్మశానవాటిక.. తొలి దహన సంస్కారం కూడా ఆయనదే

|

May 03, 2023 | 8:45 AM

విధి ఆడే వింత నాటకంలో మనుషులు కేవలం ఆట బొమ్మలు మాత్రమేననే విషయం ఈ సంఘటన మరోమారు నిరూపించింది. గ్రామంలో కొత్త శ్మశానవాటికను కట్టించిన సర్పంచ్‌, ఆయన దహన సంస్కారాలతోనే ప్రారంభమవుతుందని బహుశా ఊహించి..

Hanumakonda: సర్పంచ్‌ కట్టించిన కొత్త శ్మశానవాటిక.. తొలి దహన సంస్కారం కూడా ఆయనదే
Hanumakonda
Follow us on

విధి ఆడే వింత నాటకంలో మనుషులు కేవలం ఆట బొమ్మలు మాత్రమేననే విషయం ఈ సంఘటన మరోమారు నిరూపించింది. గ్రామంలో కొత్త శ్మశానవాటికను కట్టించిన సర్పంచ్‌, ఆయన దహన సంస్కారాలతోనే ప్రారంభమవుతుందని బహుశా ఊహించి ఉండడు. ఈ దురదృష్టకర ఘటన హనుమకొండలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే…

హనుమకొండ జిల్లా పరకాల మండలం హైబోతుపల్లి గ్రామ సర్పంచ్‌ కంచ కుమారస్వామి (25) ఆధ్వర్యంలో కొంత కాలం క్రితం తమ గ్రామంలో కొత్త శ్మశాన వాటికను నిర్మించారు. ఐతే దాని ప్రారంభం ఇంకా జరగలేదు. ఇంతలో తీవ్ర ఆర్ధిక ఇబ్బందుల కారణంగా సర్పంచ్‌ కుటుంబంలో కలహాలు ప్రారంభమయ్యాయి. భార్య పుట్టింటికి వెళ్లింది.

దీంతో మనస్థాపానికి గురైన సర్పంచ్‌ ఏప్రిల్‌ 29న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు గమనించి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం పరిస్థితి విషమించి మృతి చెందాడు. దీంతో సర్పంచ్‌ కుమారస్వామి కట్టించిన శ్మశాన వాటికలోనే ఆయన మృత దేహానికి కుటుంబ సభ్యులు తొలి దహన సంస్కారం నిర్వహించారు. దీంతో గ్రామస్తులంతా కంటనీరు పెట్టుకున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.