AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: రూ.66కే కిలో బియ్యం.. తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త..

తెలంగాణ పౌరసరఫరాల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. కిలో బియ్యం రూ.66గా ఫిక్స్ చేసింది. బియ్యం ధరలు పెరుగుతున్న క్రమంలో సామాన్యులకు ఊరట కలిగించేందుకు గరిష్ట ధరలను ఫిక్స్ చేసింది. ఇంతకంటే ఎక్కువ ధరకు వ్యాాపారులు విక్రయించడానికి వీల్లేదు. విక్రయిస్తే ప్రభుత్వం చ ర్యలు తీసుకుంటుంది.

Telangana: రూ.66కే కిలో బియ్యం.. తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త..
Rice
Venkatrao Lella
|

Updated on: Nov 09, 2026 | 6:05 PM

Share

బియ్యం ధరలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. బియ్యం ధరలకు గరిష్ట పరిమితులు విధించింది. కొంతమంది ఎక్కువ ధరలకు బియ్యంను విక్రయిస్తున్న క్రమంలో దానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అందులో భాగంగా బియ్యం ధరలను ఫిక్స్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం నిర్ణయించిన ధరలులోపే బియ్యం విక్రయించాలి. అంతకంటే అధిక ధరలకు విక్రయిస్తే ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది. బియ్యం రకాలను బట్టి గరిష్ట ధరలను ఫిక్స్ చేసింది. అలాగే బియ్యం బస్తాలపై గరిష్ట చిల్లర ధరలను కూడా ముద్రించాల్సిందేనని ఆదేశించింది. అక్రమాలకు పాల్పడితే పీడీ యాక్టులు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేసింది. బియ్యం ధరల్లో మోసాలకు పాల్పడితే సహించేది లేదంటూ హెచ్చరించింది.

బియ్యం గరిష్ట ధరలు ఇవే..

బీపీటీ, కేఎన్ఎం రకం బియ్యంకు సంబంధించి కిలో గరిష్ట ధర రూ.66గా ఫిక్స్ చేసింది. ఇక ఆర్ఎన్ఆర్, తెలంగాణ సోనా రకం కిలో గరిష్ట ధర రూ.74గా పరిమితి విధించింది. అలాగే హెచ్‌ఎంటీ, జైశ్రీరాం రకం బియ్యం గరిష్ట చిల్లర ధర రూ.79గా నిర్ణయించింది. ఎల్‌నివో ప్రభావం క్రమంలో పంట దిగుబడి తగ్గడంతో బియ్యం ధరలు దేశవ్యాప్తంగా పెరిగాయి. తెలంగాణలోనూ బియ్యం ధరలు పెరగ్గా.. కొంతమంది వ్యాపారులు దీనిని అసరాగా తీసుకుని ధరలు పెంచేస్తున్నారు. కిలో రూ.100, ఆపై ధరలకు విక్రయిస్తున్నారు. పెరిగిన ధరలతో సామాన్య, మధ్యతరగతి ప్రజలపై భారం పడుతోంది. దీంతో బియ్యం ధరల పెరుగుదలకు కళ్లెం వేసేందుకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ రంగంలోకి దిగింది. రాష్ట్రంలో బియ్యం కొరత ఉందనే ప్రచారాన్ని ప్రభుత్వం తిప్పికొట్టింది. తగినన్ని నిల్వలు ఉన్నాయని, అందులో ఎలాంటి సమస్య లేదని పేర్కొంది.

పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు

మార్కెట్ ధరలను తారుమారు చేయడం, బియ్యంను అక్రమంగా నిల్వచేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పౌరసరఫరాలశాఖ హెచ్చరించింది. నిరంతరం మిల్లర్లు, వ్యాపారులపై తనఖీలు జరుగుతాయని, ఇది నిరంతర ప్రక్రియ అని తెలిపింది. అక్టోబర్ 29వ తేదీ నుంచి నవంబర్ 5వ తేదీ వరకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ టాస్క్‌ఫోర్స్, లీగల్‌ మెట్రాలజీ శాఖలు సంయుక్తంగా తనిఖీలు చేపట్టాయి. రిటైల్ దుకాణాలు, టోకు వ్యాపారుల దుకాణాల్లో తనిఖీలు చేపట్టారు. పలువురిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. పడే పడే అక్రమాలకు పాల్పడితే పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరల్లోపు మాత్రమే బియ్యం అమ్మాలని తెలిపింది. కాగా తెలంగాణలో బియ్యం  ధరలు భారీగా పెరిగాయి. బహిరంగ మార్కెట్లో కిలో రూ.100 వరకు చేరుకున్నాయి.

Follow Us