Telangana Corona Cases: తెలంగాణలో కొనసాగుతున్న మాయదారి వైరస్.. కొత్తగా 7,646 మందికి పాజిటివ్, 53 మంది మృతి

తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్‌ ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 7,646 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ శుక్రవారం హెల్త్‌ బులిటెన్‌లో తెలిపింది.

Telangana Corona Cases: తెలంగాణలో కొనసాగుతున్న మాయదారి వైరస్.. కొత్తగా 7,646 మందికి పాజిటివ్, 53 మంది మృతి

Updated on: Apr 30, 2021 | 11:14 AM

Telangana Corona Virus Cases: తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్‌ ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలో 7,646 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని వైద్య, ఆరోగ్యశాఖ శుక్రవారం హెల్త్‌ బులిటెన్‌లో తెలిపింది. వైరస్ మహమ్మారి ధాటికి మరో 53 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొంది. కాగా, గురువారం కొత్తగా 5,926 మంది మహమ్మారి నుంచి కోలుకొని ఇళ్లకు చేరుకున్నారు. తాజాగా నమోదైన కేసులతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 4,35,606కు చేరుకుంది.

ఇక, ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా 3,55,618 మంది కోలుకున్నారు. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఇప్పటి వరకు 2,261 మంది మహమ్మారి బారినపడి ప్రాణాలొదిలారు. నిన్న ఒకే రోజు 77,091 పరీక్షలు చేసినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. ప్రస్తుతం రాష్ట్రంలో వివిధ ఆసుపత్రుల్లో 77,727 యాక్టివ్‌ కేసులున్నాయని వైద్యారోగ్య శాఖ పేర్కొంది. కొత్తగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్‌ఎంసీలో 1,441 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత మేడ్చల్‌ మల్కాజ్‌గిరిలో 631, రంగారెడ్డి జిల్లాలో 484, సంగారెడ్డిలో 401, నిజామాబాద్‌లో 330, నల్గొండలో 285, సిద్దిపేటలో 289, సూర్యాపేటలో 283, మహబూబ్‌నగర్‌లో 243, జగిత్యాలలో 230 కేసులు రికార్డయ్యాయి

ఇక, జిల్లాల వారీగా నమోదైన పాజిటివ్ కేసులు ఇలా ఉన్నాయి.

Ts Corona

Loading...
Unable to load recommendations.
Follow Us