Telangana News: ‘‘#TriumphantTelangana.. #ThankYouKCR’’ హ్యాష్ ట్యాగ్‌లతో బుధవారం ట్విట్టర్ హోరెత్తిపోయింది. దేశంలోనే ఆర్ధిక వృధ్దిరేటులో తెలంగాణ మొదటిస్థానంలో నిలవడం తెలంగాణ ప్రజలకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. రాష్ట్రం సాధించుకున్న సందర్భంలో తెలంగాణ నాయకులకు అసలు పరిపాలన చేతనవుతుందా అని మొదలైన అపోహల నుండి నేడు ఎనిమిదేళ్ల కాలంలో అత్యధిక వృద్ధిరేటు సాధించి తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది.
కేవలం ఒక రంగం అని కాకుండా అన్ని రంగాల్లో గణనీయ పురోగతిని సాధించి నేడు దేశానికే దిక్సూచిగా నిలబడింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మంత్రి కేటీఆర్ తెలంగాణ ఆర్ధిక పురోభివృద్ధి విషయంలో అన్ని గణాంకాలను కోట్ చేస్తూ మంగళవారం ట్వీట్ చేశారు. తెలంగాణ ఆర్థిక వృద్ధిని ప్రశంసిస్తూ పలువురు విదేశీ ప్రముఖులు సైతం కేటీఆర్ చేసిన ట్వీట్‌ను రీ-ట్వీట్ చేశారు.
మరోవైపు కేటీఆర్ ట్వీట్‌ను సమర్థిస్తూ.. సోషల్ మీడియాలో పెద్దఎత్తున నెటిజన్లు స్పందించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, ఎన్నారైలు, తెలంగాణ యావత్ సమాజం కళ్లెదుట కనిపిస్తున్న అభివృద్ధిని ప్రశంసిస్తూ.. వివిధ రంగాల్లో సాధించిన పురోగతిని గణాంకాలతో తమ ట్వీట్ల ద్వారా వివరించారు. ఉద్యమ నాయకుడే పాలకుడైతే అభివృద్ధి ఎలా పరుగులు పెడుతుందో చెప్పడానికి తెలంగాణ రాష్ట్రమే ఒక పెద్ద ఉదాహరణ అంటూ.. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ ఎనమిదేళ్లలో తానేమిటో యావత్ దేశానికి చూపించిందని, కేసీఆర్ దార్శనిక పాలనకు తెలంగాణ ఆర్ధిక వృద్ధి రేటు ఒక నిదర్శనమని ట్విట్టర్ వేదిక పేర్కొన్నారు.
కొత్తగా ఏర్పడిన రాష్ట్రం.. కేంద్రంలోని మోడీ సర్కార్ నుండి సహాయ నిరాకరణ ఎదురైనా.. సొంతంగా తన కాళ్ళ మీద తాను నిలబడిందని.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నేడు జరుగుతన్న అభివృద్ధి భావి తెలంగాణకు గొప్ప భరోసా అని నెటిజన్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా తెలంగాణ విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరును, వివక్షను పెద్దఎత్తున ఎండగట్టారు. 2014లో 5 లక్షలుగా ఉన్న జీఎస్డీపీ 2022 నాటికి 130 శాతం అభివృద్ధిని నమోదు చేస్తూ రూ. 11.54 కోట్లకు చేరుకుంది. కేసీఆర్ పాలనా సామర్థ్యంతోనే ఇది సాధ్యమయ్యిందని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. మొత్తం మీద 50 వేలకు పైగా ట్వీట్లతో ట్విట్టర్లో #TriumphantTelangana హ్యాష్ ట్యాగ్ హోరెత్తి దేశ ప్రజలను, జాతీయ మీడియాను ఆకర్షించింది.
Also read:
Russia Ukraine War: తక్షణమే ఖార్కివ్ నుండి బయటపడండి.. భారతీయులకు ఇండియన్ ఎంబసీ గంటలో రెండో ఆదేశం!